Andhra Pradesh: సెల్ఫీ తీసుకుని సింహం ముందు తొడగొట్టిన వ్యక్తి.. ఆ మరుక్షణమే ఏం జరిగిందంటే..
'పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది'.. ఇది ఓ సినిమాలోని డైలాగ్ ఇది.. కానీ.. ఓ వ్యక్తి.. అచ్చం అలాంటి డైలాగ్ ని తలపించేలా.. సింహంతో ట్రై చేశాడు.. అడవి రాజైన సింహం.. అంటే మామూలుగా ఉంటదా.. ఏంటి..? సింహంతో పరాచికాలాడి చావును కొనితెచ్చుకున్నాడు..
‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’.. ఇది ఓ సినిమాలోని డైలాగ్ ఇది.. కానీ.. ఓ వ్యక్తి.. అచ్చం అలాంటి డైలాగ్ ని తలపించేలా.. సింహంతో ట్రై చేశాడు.. అడవి రాజైన సింహం.. అంటే మామూలుగా ఉంటదా.. ఏంటి..? సింహంతో పరాచికాలాడి చావును కొనితెచ్చుకున్నాడు.. సెల్ఫీ కోసం ట్రై చేసిన ఆ వ్యక్తి ప్రాణాన్ని క్షణాల్లో తీసేసింది సింహం.. ఈ షాకింగ్ ఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర జూలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38) అనే వ్యక్తి.. తిరుపతి శ్రీవెంకటేశ్వర జూకి వచ్చాడు.. వచ్చి రాగానే అక్కడ తిరుగుతూ.. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు.. సెల్ఫీ కోసం సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. దర్జాగా సెల్ఫీ తీసుకున్నాడు.. ఆ తర్వాత ఏదో సాధించినట్లు తొడకూడా కొట్టాడు.. సింహం కదిలేసరికి.. గుర్జార్.. చెట్టు ఎక్కి కూర్చున్నాడు.. కాసేపటికి అదుపుతప్పి చెట్టుపై నుంచి కిందపడటంతో ఆ వ్యక్తిపై రెప్పపాటులో సింహం దాడిచేసింది. సింహం అతనిపై దాడి చేసి శరీరాన్ని చీల్చీవేసింది.
ఈ దాడి ఘటన అనంతరం.. జంతుప్రదర్శనశాల అధికారులు అక్కడికి చేరుకుని.. సింహాన్ని బోన్‌లో బంధించారు. ప్రస్తుతం జూ దగ్గర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. జూలోకి సిబ్బంది ఎవర్నీ అనుమతించడం లేదు..
అయితే, ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..