AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలోని ఆ ప్రాంతంలో 3 నెలలు చికెన్‌ షాపులన్నీ క్లోజ్.. కలెక్టర్ ఆదేశాలు

పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్‌ ఇన్‌ఫ్లూఎంజాతో కోళ్లు పెద్దఎత్తున చనిపోయాయని అధికారులుతెలిపారు. ఇన్‌ఫ్లూఎంజా నిర్ధారణ కావడంతో ప్రబలకుండా అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్‌ షాప్‌ యజమానుల్లో చైతన్యం తేవాలన్నారు.

AP News: ఏపీలోని ఆ ప్రాంతంలో 3 నెలలు చికెన్‌ షాపులన్నీ క్లోజ్.. కలెక్టర్ ఆదేశాలు
Chicken Shop
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2024 | 11:21 AM

Share

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 16:  నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ టెన్షన్ పెడుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్లు మృతి చెందాయి. కోళ్ల శాంపిల్స్‌ భోపాల్‌ ల్యాబ్‌కు పంపిన అధికారులు.. వచ్చిన రిపోర్టుల ఆధారంగా కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నిర్ధారించారు. దీంతో పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. బర్డ్‌ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటూ చికెన్‌ షాపులు మూసివేయాలని…. కిలోమీటరు 3 నెలల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ అయిన ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.

చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని కలెక్టర్ సూచించారు. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.  ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్‌ షాప్‌ యజమానులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కోళ్లు చనిపోయిన గ్రామాల పరిధిలో వెంటనే శానిటైజేషన్‌ చేయించాలని.. కొన్నాళ్లు పాటు ఈ పద్దతి కొనసాగించాలని సూచించారు. ఈ బర్డ్‌ ఫ్లూపై ఆ 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్‌ సీఈవో గ్రామసభలు నిర్వహించాలన్నారు. బర్డ్‌ఫ్లూ నివారణ చర్యలపై రోజూవారీ నివేదిక సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కాగా ఏవీఏఎన్‌ ఇన్‌ఫ్లూఎంజాతో కోళ్లు పెద్దఎత్తున చనిపోయాన్న వార్తలతో ఏపీలోని పౌల్ట్రీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు రావడంతో మార్కెట్లో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన నెలకొంది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు,

దేశంలో బర్డ్‌ఫ్లూని 2006లో తొలిసారి గుర్తించారు. వలస పక్షుల కారణంగానే చలికాలంలో వైరస్‌ వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ తరహా వైరస్ పక్షులకు బర్డ్‌ ఫ్లూ సోకుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..