Anakapalli: ‘రెండోసారి కూడా ఇబ్బంది పెట్టలేక’.. యువకుడి సూసైడ్ నోట్

ఆన్‌లైన్‌ గేమింగ్‌ మాయలో పడితే అంతా హాంఫట్‌. డబ్బుల ఆశ చూపి ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. ఇప్పుడు చాలా మంది గేమింగ్‌ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మోసపోయామని తెలిసే లోపే పూర్తిగా నష్టపోతున్నారు బాధితులు. లక్షల్లో నష్టపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..

Anakapalli: 'రెండోసారి కూడా ఇబ్బంది పెట్టలేక'.. యువకుడి సూసైడ్ నోట్
Koti
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 16, 2024 | 10:46 AM

మాయదారి ఆన్‌లైన్‌ ఆటలు.. యువతను పెడదారి పట్టిస్తున్నాయి. సరదా ఊబిలోకి దించి.. వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. చివరకు వారినే చిదిమేస్తున్నాయి. అవును..  ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. అదృష్టం కలిసి వస్తోందన్న భ్రమలో.. వాటికి బానిసలై ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. ఆపై.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాం పురానికి చెందిన చందకపు కోటి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిస అయ్యాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి నష్టపోతే మొదటిసారి అప్పులపాలైనప్పుడు తల్లిదండ్రులు ఆ అప్పును తీర్చేశారు. అయితే మళ్లీ రెండోసారి సేమ్ సిచ్చువేషన్‌ వచ్చేసరికి.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడంకంటే చావే మేలు అనుకున్నాడు కోటి. అమ్మ, నాన్న, చెల్లి క్షమిచండంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.. తన పిన్ని మృతితో తల్లిదండ్రులపై కేసు పెట్టించి వేధించారని ఆవేదన వ్యక్తం చేసిన కోటి.. తన విషయం మళ్లీ తల్లిదండ్రులకు భారం కాలేక తనువు చాలించాడు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఫ్రీ ఫైర్‌ గేమ్స్‌….!! ఈ ఆన్‌లైన్‌ ఆటల గురించి తెలియని వారుండరు. యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఇవి. కొందరు చిన్నారులు, యువకులు నిద్రాహారాలు మానేసి… ఈ ఆటలకు బానిసలవుతున్నారు. వీటి ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది.. తమకు తెలియకుండానే… మానసికంగా, శారీరకంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. ఆట వద్దని చెబితే విచక్షణ కోల్పోయి… హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు. అందుకే… ఈ క్రీడను గేమింగ్‌ డిజార్డర్‌గా గుర్తించారు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌… జస్ట్‌ ఫర్‌ టైమ్‌ పాస్‌..!! ఫన్‌ కోసం మొదలు పెట్టినా… ఆ సరదా కాస్తా.. యువత పాలిట శాపంగా మారుతోంది. స్మార్ట్‌ గేమ్స్‌లో పడిన యూత్‌.. సమస్తాన్ని కోల్పోతున్నారు. గంటల తరబడి గేమ్స్‌ మోజులో పడి.. విద్యకు దూరమై.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు.. బెట్టింగ్ యాప్స్‌కు బానిసై.. లక్షల రూపాయలు తగలబెడుతున్నారు. చివరకు.. ప్రాణాలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..