Andhra Pradesh: చదివింది గవర్నమెంట్ స్కూల్.. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్న తెలుగు విద్యార్ధులు..

ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగనుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు త్వరలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. తెలుగు విద్యార్థులకు ఐక్యరాజ్యసమితిలోనూ, అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించే అవకాశం దక్కడం ఎంతో అరుదు. ఈ అవకాశం నూజివీడుకు ట్రిపుల్ ఐటిలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు దక్కటం..

Andhra Pradesh: చదివింది గవర్నమెంట్ స్కూల్.. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్న తెలుగు విద్యార్ధులు..
Nuziveedu IIIT students
Follow us
B Ravi Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Sep 07, 2023 | 2:58 PM

ఏలూరు, సెప్టెంబర్ 7: ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగనుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు త్వరలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు. తెలుగు విద్యార్థులకు ఐక్యరాజ్యసమితిలోనూ, అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో, ప్రపంచ బ్యాంకులో ప్రసంగించే అవకాశం దక్కడం ఎంతో అరుదు. ఈ అవకాశం నూజివీడుకు ట్రిపుల్ ఐటిలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులకు దక్కటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడు కార్యక్రమాల ద్వారా శిధిలావస్థలో ఉన్న పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలు తలదన్నే విధంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను అందించడంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎన్నో మన్ననలు పొందారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి నూజివీడు ట్రిపుల్ ఐటీ లో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు త్వరలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించమన్నారు. అమెరికా పర్యటన కోసం జూలైలో రాష్ట్ర ప్రభుత్వం అర్హత పరీక్ష నిర్వహించారు. ఆపరీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి 105 మంది విద్యార్థులు హాజరయ్యారు. అర్హత పరీక్ష ద్వారా 30 మంది విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేయగా వారిలో పదిమంది అమెరికా పర్యటనకు ఎంపికయ్యారు. ఆ పదిమంది విద్యార్థులు నలుగురు నూజివీడు ట్రిపుల్ ఐటి కి చెందినవారు కావడంతో అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 15 నుండి నుండి 27 వరకు అమెరికాలో పర్యటీంచనున్నారు.

పర్యటనలో ముందుగా ఐక్యరాజ్యసమితిలోనూ, అలాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో, ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం లోను, అమెరికా ప్రభుత్వ సమావేశాలలో ప్రసంగించనున్నారు. ప్రసంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో స్థిరమైన వృద్ధి లక్ష్యాలపై, ఇక్కడ విద్యాసంస్కరణలపై, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దిన విధానంపై, అందుకున్న ఫలితాలపై ప్రసంగించనున్నారు. అయితే ఇంత గొప్ప అవకాశం రావడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యాసంస్కరణల కారణంగా తమకు అత్యున్నత అవకాశాలు వచ్చాయని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.