Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viveka Murder Case: ఇవాళ మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా శుక్రవారం (మే19) మళ్లీ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి. సీబీఐ నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు ఆయన రానున్నారు.

Viveka Murder Case: ఇవాళ మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌ రెడ్డి.. విచారణపై సర్వత్రా ఉత్కంఠ
Avinash Reddy
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2023 | 8:10 AM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా శుక్రవారం (మే19) మళ్లీ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి. సీబీఐ నోటీసుల ప్రకారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు ఆయన రానున్నారు. ఇందుకోసం. గురువారం సాయంత్రానికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఈనెల 16నే విచారణకు హాజరుకావాలని సీబీఐ అవినాష్‌ రెడ్డికి కబురు పంపింది. అయితే పులివెందుల నియోజకవర్గంలో.. ముందే అనుకున్న కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందంటూ.. అవినాష్‌ 4రోజుల గడువు కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ సందర్భంగా పులివెందులలోని ఎంపీ ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసులు అందజేశారు. కాగా ముందస్తు షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన అవినాశ్‌ రెడ్డి, ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడా ఎంపీకి చుక్కెదురైదుంది.

కాగా వివేకా హత్య కేసులో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ కీలకంగా మారనుంది. అయితే సీబీఐ నోటీసుల మేరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరవుతారా? లేక మరేదైనా కారణంతో గడువు కోరతారా? ఒక వేళ విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..