Nara Lokesh: విజయ పాల డెయిరీపై నారా లోకేష్ సంచలన ఆరోపణలు.. ఆ వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ..
విజయ పాల డెయిరీపై టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకు లక్ష లీటర్ల పాల సేకరణ, 240 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ పాల డెయిరీని వైసీసీ నేతలు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు.
విజయ పాల డెయిరీపై టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుకు లక్ష లీటర్ల పాల సేకరణ, 240 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ పాల డెయిరీని వైసీసీ నేతలు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విజయ పాల డెయిరీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ 240 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ పాల డెయిరీని వైసీసీ నేతలు దోచుకుంటున్నారు. పాల డెయిరీకి ఉన్న వందల కోట్ల విలువైన భూములను అమూల్ కి ధాదాధత్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే విజయ పాల డెయిరీ అక్రమార్కులను బొక్కలో వేయిస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. ఈ వ్యాఖ్యలపై విజయ పాల డెయిరీ చైర్మన్ ఎస్.వీ. జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ‘నారా లోకేష్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాము. డెయిరీలో అక్రమాలు ఉంటే సీబీఐ విచారణకు కోరుతున్నాం. లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే చిత్తూరు హెరిటేజ్ డెయిరీ పై కూడా సీబీఐ విచారణకు రావాలి. మేము సిద్ధం’
‘హెరిటేజ్ లాభాల కోసం చిత్తూరు డెయిరీ ని సమాధి చేసిన ఘనత చంద్రబాబుది. విజయ పాల డెయిరీకి కోటి న్నర రూపాయలు ఎగ్గొట్టిన భూమా అఖిలప్రియ , భూమా బ్రహ్మానందరెడ్డిని లోకేష్ ఇరువైపులా పెట్టుకుని డెయిరీ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. లోకేష్.. నీలో సత్తా ఉంటే మీ టీడీపీ నేతలు తీసుకున్న కోటిన్నర రూపాయలు కక్కించాలి’ అని సవాల్ విసిరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..