AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: నేడు వాలంటీర్లకు వందనం.. పలువురిని సత్కరించనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం 'వాలంటీర్లకు వందనం' అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు...

CM Jagan: నేడు వాలంటీర్లకు వందనం.. పలువురిని సత్కరించనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి
Ap Cm Jagan (file Photo)
Narender Vaitla
|

Updated on: May 19, 2023 | 6:35 AM

Share

వలంటీర్లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది వైసీపీ ప్రభుత్వం ‘వాలంటీర్లకు వందనం’ అనే కార్యక్రామాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్ల సేవలను గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రోత్సాహకంగా సత్కారం చేస్తూ వస్తోంది.

అవినీతికి తావు లేకుండా, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం ఖర్చుచేసింది.

మొత్తం మూడు కేటగిరీల్లో పురస్కారాలు..

మే 19వ తేదీ నంఉచి అన్ని నియోజకవర్గాల్లో వలంటీర్లకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా వలంటీర్లు అందిస్తున్న సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నియోజకవర్గంలో అత్యత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర పేరుతో.. సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.30,000 నగదు బహుమతి అందించనున్నారు. ఇక సేవా రత్న పేరుతో ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌–1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.20,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. సేవా మిత్ర ద్వారా ఎలాంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్ చేస్తే.. ట్విస్ట్ అదుర్స్
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
సొంతిట్లో ఇలాంటి వారు ఉంటే డేంజర్.. సంతోషం దూరమవుతుంది!
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామ
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామ
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌కు వెల్లువలా దరఖాస్తులు! బిగ్ సైబర్ దాడి..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘బాంబ్రోలిస్తాన్’.. అసలు స్టోరీ ఇదే..!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు!
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం