Andhra: ఒక్కో కుటుంబానికి తక్షణమే రూ.3 వేలు ఇవ్వండి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఏపీ తీరాన్ని మొంథా తుపాన్ ప్రభావం తాకడం ప్రారంభించింది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన ఆరు గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన తుపాన్, ప్రస్తుతం చెన్నైకి 520కి.మీ., కాకినాడకి 570కి.మీ., విశాఖపట్నంకి 600కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

ఏపీ వ్యాప్తంగా తుపాన్ ప్రభావం ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది ప్రభావం పెరగనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో కదిలింది మొంథా తుపాన్. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మొంథా తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణ శాఖ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. ప్రజలు అత్యవసర సహాయ చర్యలు, తుఫాను సమాచారం కోసం ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




