AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2025 Registration: అయ్య బాబోయ్‌.. టెట్‌ ఫీజు చూసి గుడ్లు తేలేస్తున్న నిరుద్యోగులు! జేబుకు చిల్లులు..

AP TET 2025 Notification Released: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ 2025)నోటిఫికేషన్‌ విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా అక్టోబర్ 24 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులతోపాటు ఇన్ సర్వీస్ టీచర్లకు సైతం టెట్ రాసేందుకు..

AP TET 2025 Registration: అయ్య బాబోయ్‌.. టెట్‌ ఫీజు చూసి గుడ్లు తేలేస్తున్న నిరుద్యోగులు! జేబుకు చిల్లులు..
Andhra Pradesh TET Exam
Srilakshmi C
|

Updated on: Oct 27, 2025 | 4:42 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్ 2025)నోటిఫికేషన్‌ విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా అక్టోబర్ 24 నుంచి ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులతోపాటు ఇన్ సర్వీస్ టీచర్లకు సైతం టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో విద్యాశాఖ స్పష్టం చేసింది. అంటే 2011కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక టెట్‌ పరీక్ష డిసెంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టెట్‌ ఫలితాలు వచ్చే ఏడాది జనవరి 19న వెలువడనున్నాయి. గతంలో ఒక్కో పేపర్‌కు రూ.750 చెల్లించేవారు. ఈసారి భారీగా దరఖాస్తు ఫీజులు పెరగడంలో నిరుద్యోగ అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు.

ఈసారి టెట్‌ దరఖాస్తు ఫీజును సర్కార్ భారీగా పెంచింది. ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొంది. అంటే ఒక అభ్యర్ధి 2 పేపర్లకు పరీక్ష రాస్తే రూ. 2 వేలు పరీక్ష ఫీజుగా ఇచ్చుకోవాల్సిందే. పేపర్ 1 ఏ, పేపర్‌ 1 బి, పేపర్ 2 ఏ, పేపర్ 2 బి.. మొత్తం 4 పేపర్లకు టెట్ పరీక్ష ఉంటుంది. ఎన్ని పేపర్లు రాస్తే అన్నింటికీ సపరేట్‌గా ఫీజు కట్టాలి. నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, అర్హతలు వంటి వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి సూచించారు.

ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్‌, అప్లికేషన్‌, సిలబస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 24, 2025.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: నవంబర్ 23, 2025.
  • ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ తేదీ: నవంబర్‌ 25, 2025.
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: డిసెంబర్‌ 3, 2025 నుంచి
  • పరీక్ష తేదీ: డిసెంబర్‌ 10, 2025.
  • కీ విడుదల తేదీ: జనవరి 2, 2026.
  • కీపై అభ్యంతరాల స్వీకరణ తేదీలు: జనవరి 2 నుంచి 9 వరకు
  • తుది కీ విడుదల: జనవరి 13, 2026.
  • ఫలితాలు విడుదల తేదీ : జనవరి 19, 2026.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.