Andhra Pradesh: వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం అదేనా..?
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితమే స్థలం చూసినప్పటికీ భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలని వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేశారు. పార్టీ ప్రాంతీయ ఇంఛార్జిగా వైవీ సుబ్బా రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే పదినెలల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ఇంకా పూర్తిగా కాకపోయినా మొదటి అంతస్తులో కొన్ని రూంలు సిద్ధం చేసి మంచి ముహూర్తంగా భావించి కార్యాలయాన్ని మార్చేశారు.
విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలోకి మారింది. ఇప్పటివరకు నగరంలోని మద్దిలపాలెం సమీపంలో కృష్ణా కళాశాలను ఆనుకుని ఉన్న పార్టీ కార్యాలయం ఇక వినియోగంలో ఉండదు. ఇకపై పార్టీ కార్యకలాపాలు అన్నీ ఎండాడలో కొత్తగా నిర్మించిన సొంత పార్టీ కార్యాలయంలోనే నిర్వహించబడుతాయి. వాస్తవానికి వైసీపీకి సొంత పార్టీ కార్యాలయం ఇప్పటివరకు విశాఖపట్నంలో లేదు. గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వంశీ ఉన్న సమయంలో ఆయనకు చెందిన కార్యాలయంలో.. ఆ తర్వాత మళ్ళ విజయ ప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు చెందిన స్థలంలో కార్యాలయాన్ని నిర్మించి పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా కళాశాల సమీపంలో ఉంది కూడా మళ్ళ విజయ ప్రసాద్‌కు చెందిన స్థలంగా చెబుతారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని నిర్ణయించారు. మూడేళ్ల క్రితమే స్థలం చూసినప్పటికీ భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉండాలని వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేశారు. పార్టీ ప్రాంతీయ ఇంఛార్జిగా వైవీ సుబ్బా రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే పదినెలల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం ఇంకా పూర్తిగా కాకపోయినా మొదటి అంతస్తులో కొన్ని రూంలు సిద్ధం చేసి మంచి ముహూర్తంగా భావించి కార్యాలయాన్ని మార్చేశారు. మంత్రి అమర్ నాథ్ కార్యాలయాన్ని ప్రారంభించగా విశాఖ ఎంపీ.. ఎం.వి.వి సత్యనారాయణ.. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఇతర పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు
కాబోయే రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఇదే వాస్తవానికి ఈ పార్టీ నిర్మాణం ప్రారంభమైన సమయంలోనే ముఖ్యమంత్రి త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతారన్న వార్తలు విస్తృతంగా వచ్చాయి. దీంతో భవిష్యత్తులో ప్రస్తుతం నిర్మిస్తున్న పార్టీ కార్యాలయమే రాష్ట్ర పార్టీ కార్యాలయంగా కూడా ఉండవచ్చని అప్పట్లోనే పార్టీ నేతలు సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సొంత భవనం కాదు. దీంతో కచ్చితంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం విశాఖలో నిర్మిస్తున్న భవనమే కూడా కావచ్చు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం నిర్మిస్తున్న కార్యాలయంలో జిల్లా కార్యాలయంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రస్తుతం నిర్వహిస్తారని, ముఖ్యమంత్రి విశాఖకు వస్తే అవసరమైతే అదనపు భవనాలను నిర్మించి ఇదే పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండబోతుందన్న అభిప్రాయాన్ని నేతలు అనేకసార్లు చెప్పారు. ఈరోజు పార్టీ కార్యాలయ ప్రారంభ సమయంలో మంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు.
ఆ మేరకే పార్టీ కార్యాలయ నిర్మాణంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా ప్లాన్ తయారు చేశారని, అయితే ప్రస్తుతం పరిమితమైన నిర్మాణాన్ని చేపట్టినా భవిష్యత్తులో అవసరాన్ని బట్టి నిర్మాణాలను కొనసాగిస్తారన్నది వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ టీవీ9 తో మాట్లాడుతూ ఏపీలో 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం జగన్ సంకల్పించారనీ, అందుకు మొదటి కార్యాలయం విశాఖలో ప్రారంభించామన్నారు. అవసరాన్ని బట్టి ఈ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయంగా కూడా ఉపయోగిస్తామని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..