Solar Mission: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యం ఎల్1.. రాకెట్‌లోని పేలోడ్లు ఇవే..

Aditya-L1: సూర్యుడు-భూమి మధ్యలోని లాంగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపు పయనించి, సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనుంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్1 ముందుగా భూమి నుంచి సూర్యుడి వైపు 125 రోజుల ప్రయాణం చేసి లాంగ్రాంజ్ పాయింట్ ఎల్1ని చేరుకుంటుంది. ఇక ఈ ప్రయోగం కోసం రూ.400 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా..

Solar Mission: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్యం ఎల్1.. రాకెట్‌లోని పేలోడ్లు ఇవే..
Aditya L1
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 02, 2023 | 12:42 PM

Aditya L1: చంద్రయాన్ 3 ప్రయోగం తర్వాత భారత్ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక మిషన్ ‘ఆదిత్యం ఎల్1’. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ చేస్తోన్న తొలి మిషన్‌ ఇదే కావడం విశేషం. ఇక దీనికి నిన్న అంటే శుక్రవారం కౌంట్ డౌన్ స్టార్ అవగా, ఈ రోజు ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది ఆదిత్య ఎల్‌-1 రాకెట్. ఇది సూర్యుడు-భూమి మధ్యలోని లాంగ్రాంజ్‌ పాయింట్‌-1 వైపు పయనించి, సూర్యుడిపై సోలార్ స్టార్మ్స్‌ను స్టడీ చేయనుంది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్1 ముందుగా భూమి నుంచి సూర్యుడి వైపు 125 రోజుల ప్రయాణం చేసి 15 లక్షల కి.మీల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ ఎల్1ని చేరుకుంటుంది. ఇక ఈ ప్రయోగం కోసం రూ.400 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా ఇస్రో తెలిపింది. అలాగే ఈ శాటిలైట్ లైఫ్ టైమ్ 5 ఏళ్లకు పైగానే ఉంటుందని సమాచారం.

అసలు అదిత్య L1లో ఎలాంటి పరికరాలు ఉంటాయి..? అంటే Aditya L1 మొత్తం ఏడు పేలేడ్లు మోసుకెళ్తుంది. ఇందులో ప్రధానమైనది విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (VELC). అలాగే సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజీ ఫర్‌ ఆదిత్య. ఇంకా..సోలార్‌ లో ఎనర్జీ స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాగ్రెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చారు.

ఒక్కో పేలోడ్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

  1. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రఫీ (వీఈఎల్‌సీ)- ఇది దృశ్యాలను చిత్రీకరించటంతో పాటు స్పెక్ట్రమ్‌నూ  రూపొందిస్తుంది. ఇది సూర్యుడి చుట్టూ 1.05 రేడియై నుంచి 3 రేడియై వరకు ఉన్న కొరానాను అధ్యయనం చేయటానికి తోడ్పడుతుంది. సూర్యుడి వెలుగును అడ్డుకొని, చుట్టూ ఉండే కొరానా దృశ్యాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఆదిత్య ఎల్‌1కే ప్రత్యేకం. సూర్యుడి నుంచి వెలువడే అయస్కాంత క్షేత్రం పుట్టుకను శోధించటంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
  2. సోలార్‌ అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌ (సూట్‌)- విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌కు చెందిన అతినీలలోహత ప్రాంతంలో దృశ్యాలను సేకరిస్తుంది. ఉపరితలం నుంచి ఆయా ఎత్తుల్లో సూర్యుడు ఎలా ఉంటాడో అనేది వివిధ కోణాల్లో చిత్రీకరిస్తుంది.
  3. సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (సోలెక్స్‌)
  4. హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ లేదా హీలియోస్‌- ఇవి సాఫ్ట్‌, హార్డ్‌ ఎక్స్‌రే పరికరాలు. సౌర జ్వాలల కీలక సమాచారాన్ని అందిస్తాయి.
  5. ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఆస్‌పెక్స్‌)
  6. ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య (పాపా): ఇవి ఇన్‌సిటు పరికరాలు. ఎల్‌1 కేంద్రం వద్ద సౌర గాలుల రేణువుల తీరుతెన్నులు, మిశ్రమాల మీద అధ్యయనం నిర్వహిస్తాయి.
  7. అడ్వాన్స్డ్‌ ట్రై-యాక్జియల్‌ హై రెజల్యూషన్‌ డిజిటల్‌ మాగ్నెటోమీటర్స్‌: ఇవీ ఇన్‌సిస్ట్ పరికరాలే. ఎల్‌1 కేంద్రం వద్ద అంతర్‌ గ్రహ ప్రాంతంలో అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తాయి.

ఆదిత్య ఎల్‌1కు టెలిస్కోప్‌కు సూర్యుడి మీద ఆయా ప్రాంతాల్లో దృష్టిని కేంద్రీకరించే వినూత్న పరిజ్ఞానాన్నీ జోడించారు. హఠాత్తుగా చెలరేగే సీఎంఈలు, సౌర జ్వాలలు, తుపాన్ల వంటి వాటిని పసిగట్టటానికిది తోడ్పడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..