Andhra Pradesh: సీఎం జగన్‌ని కలిసిన గురుకుల విద్యార్థులు.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం, ట్యాబ్ అందించిన ముఖ్యమంత్రి..

Andhra Pradesh: విదేశీ విద్యకు సెలక్ట్ అయిన ఏపీ గురుకుల విద్యార్థులు సీఎం జగన్‌ కలిశారు. వారికి లక్ష రూపాయల నగదు.. ట్యాబ్ అందజేసిన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ నేపధ్యం, విద్యా వివరాలు ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఒక్కో విద్యార్ధికి ప్రోత్సాహకంగా లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. అలాగే శాంసంగ్‌ ట్యాబ్‌ను సీఎం చేతుల మీదుగా అందజేశారు..

Andhra Pradesh: సీఎం జగన్‌ని కలిసిన గురుకుల విద్యార్థులు.. ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం, ట్యాబ్ అందించిన ముఖ్యమంత్రి..
CM Jagan with Students
Follow us

|

Updated on: Aug 31, 2023 | 9:48 PM

అమరావతి, ఆగస్టు 31: విదేశీ విద్యకు ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. విదేశీ విద్యకు గురుకుల పాఠశాలల నుంచి దేశ వ్యాప్తంగా 30మంది సెలక్ట్ కాగా.. వారిలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. అమెరికా చదువుల కోసం రాష్ట్రం నుంచి సెలక్ట్ అయిన ఐదురుగు విద్యార్థులు సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసారు ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ సొసైటీకి చెందిన విద్యార్ధులు. సీఎంను కలిసిన విద్యార్ధుల్లో డి.నవీన, ఎస్‌.జ్ఙానేశ్వరరావు, రోడా ఇవాంజిల్, బి.హాసిని, సీహెచ్‌.ఆకాంక్ష, కె.అక్ష, సి.తేజ ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో సీఎం ముచ్చటించారు. వారి కుటుంబ నేపధ్యం, విద్యా వివరాలు ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఒక్కో విద్యార్ధికి ప్రోత్సాహకంగా లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. అలాగే శాంసంగ్‌ ట్యాబ్‌ను సీఎం చేతుల మీదుగా అందజేశారు.

యూఎస్‌ఏలో చదువులు పూర్తయి వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. సీఎంను క‌లిసిన వారిలో గత ఏడాది అమెరికా వెళ్ళి కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఇద్దరు విద్యార్ధులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నారు. జూలై 27న‌ సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్. విద్యావ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ