Chittoor District: మదపుటేనుగును బంధించిన ఫారెస్ట్ అధికారులు.. కొనసాగుతున్న ఆపరేషన్ గజ.. ఇప్పటికే నలుగురు బలి..
Chittoor District News: ఉమ్మడి చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో హల్చల్ చేసింది ఒంటరి ఏనుగు. శ్రీ రంగం పల్లి, చీలాపల్లి ప్రాంతాల్లో తెల్లవారు జామున 5 గంటల సమయంలో కార్తీక్ అనే యువకుడిపై ఆ ఏనుగు దాడి చేసింది. ఇంకా 10 ఆవులను తొక్కి చంపింది. అలాగే చీలాపల్లి దగ్గర పొలంలో పని చేసుకుంటున్న వెంకటేష్- సెల్వి అనే దంపతులపై దాడి..
చిత్తూరు జిల్లా, ఆగస్టు 31: ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో గజరాజులతో జాగ్రత్తగా ఉండాలి’ అంటూ బోర్డర్ గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారుల హెచ్చరిస్తున్నారు. అవును, కర్ణాటక- ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో మదపుటేనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో హల్చల్ చేసింది ఒంటరి ఏనుగు. శ్రీ రంగం పల్లి, చీలాపల్లి ప్రాంతాల్లో తెల్లవారు జామున 5 గంటల సమయంలో కార్తీక్ అనే యువకుడిపై ఆ ఏనుగు దాడి చేసింది. ఇంకా 10 ఆవులను తొక్కి చంపింది. అలాగే చీలాపల్లి దగ్గర పొలంలో పని చేసుకుంటున్న వెంకటేష్- సెల్వి అనే దంపతులపై దాడి చేసి చంపింది.
మరో వైపు తమిళనాడు సరిహద్దు ప్రాంతం కోడేనత్తం గ్రామానికి చెందిన వసంత అనే మహిళపై కూడా దాడి చేసింది. ఈ ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. అంతటితో ఆగకుండా 190 రామాపురం దగ్గర ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది ఒంటరి ఏనుగు. ఇప్పటి వరకు ఒంటరి ఏనుగుల దాడికి ఆరుగురు బలైనట్లు చెప్తున్నారు అధికారులు.
197 రామాపురం సమీపంలో తిష్ట వేసిన బీభత్సం సృష్టిస్తున్న మదపుటేనుగును బంధించారు ఫారెస్ట్ అధికారులు. తమిళనాడు- ఆంధ్ర రాష్ట్రాల అటవీశాఖ అధికారులు సంయూక్తంగా ఆపరేషన్ గజ చేపట్టారు. జాయింట్ ఆపరేషన్‌లో గుడిపాల మండలం 197 రామాపురం దగ్గర ఒంటరి ఎనుగును మత్తు మందు ఇచ్చి బంధించారు. ఈ ఆపరేషన్‌లో కుంకీ ఏనుగులు కీలకంగా వ్యవహరించాయి. బంధించిన ఒంటరి ఏనుగును తిరుపతి జూ పార్కుకు తరలించారు. కౌండిన్య అభయారణ్యంలోని గుంపుల్లో ఇమడలేక వెలివేయబడ్డ దాదాపు 15కు పైగా ఒంటరి ఏనుగులు దారి తప్పి జనావాసాల్లో సంచరిస్తూ దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాను ఫారెస్ట్ అధికారులు.
కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో గజరాజుల గుంపులు దాదాపు 20కి పైనే ఉన్నాయి. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కౌండిన్య అభయారణ్యంలో గజరాజుల సంఖ్య వందల్లో ఉంటుంది. దాదాపు 300 కిలోమీటర్ల మేర గజ రాజుల సామ్రాజ్యం ఉంటుంది. ఈ సీజన్ ఏనుగులకు మస్తు సమయం కావడంతో మధమెక్కిన ఏనుగులు మూడు నెలలు పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి దాడులు చేయడం చేస్తాయని.. ఇలాంటి పరిస్థితి ప్రతి ఏటా జరుగుతుందని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..