Idupulapaya: ఇడుపులపాయలో YSRకు భట్టి నివాళి.. షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై ఏమన్నారంటే
తాజాగా కడప జిల్లా ఇడుపులపాయలో వైయస్ సమాధిని సందర్సించి నివాళులు అర్పించారు మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తవ్వడంతో తన పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు.. పాల్గొన్న వ్యక్తిగత సిబ్బంది, పాదయాత్ర ఆసాంతం వివిధ విభాగాల్లో సేవలు అందించిన నాయకులు, భద్రతా సిబ్బందితో కలిసి తిరుపతికి వెళ్ళాలనుకున్న భట్టి ప్రత్యేక బస్సులో తిరుపతి వెళుతూ మార్గం మధ్యలో ఇడుపులపాయ వెళ్లి.. దివంగత నేత వైయస్ కు కూడా నివాళులు అర్పించారు
పాదయాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చే నాయకుడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి. పాదయాత్ర అంటే ఏమిటి దాని వలన వచ్చే ఉపయోగాలేంటి అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఓనమాలు నేర్పిన నేత వైయస్ఆర్. ఆ తర్వాత అనేకమంది నేతలు ఉమ్మడి ఆంద్రప్రదేష్‌లో, రాష్ట్రం విడిపోయిన తరువాత.. ఉభయ రాష్ట్రాల్లో పాదయాత్రల పర్వాన్ని కొనసాగించారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే.. కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల తెలంగాణ సిఎల్పి నేత , కాంగ్రేస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సైతం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైయస్ సమాధిని సందర్సించి నివాళులు అర్పించారు మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తవ్వడంతో తన పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు.. పాల్గొన్న వ్యక్తిగత సిబ్బంది, పాదయాత్ర ఆసాంతం వివిధ విభాగాల్లో సేవలు అందించిన నాయకులు, భద్రతా సిబ్బందితో కలిసి తిరుపతికి వెళ్ళాలనుకున్న భట్టి ప్రత్యేక బస్సులో తిరుపతి వెళుతూ మార్గం మధ్యలో ఇడుపులపాయ వెళ్లి.. దివంగత నేత వైయస్ కు కూడా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో నాతో పాల్గొన్న నా సిబ్బంది , సహచరులు తిరుపతి వెళ్ళాలని అనుకున్నాం, అందులో భాగంగా దారిలో ఉన్న వైయస్ఆర్ సమాధిని కూడా దర్శించుకుని నివాళులు అర్పించాలని ఇక్కడికి వచ్చాం’ అని అన్నారు. తానును వైయస్ ఆర్ దగ్గర మండలి సభ్యుడిగా , శాసనసభలో ఛీఫ్ విప్‌గా పనిచేశానని , వైయస్ఆర్‌తో అత్యంత సన్నిహితంగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వైయస్ఆర్‌కు పేద ప్రజలపై , వ్యవసాయంపై , రాష్ట్ర అభివృద్దిపై ఎంతో తపన ఉండేదని, అందుకే ఆయన అనుచరుడిగా పెద్ద ఎత్తున వైయస్ఆర్‌పై మమకారం పెరిగిందన్నారు. వైయస్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలన్నదే తన ఆశయం, లక్ష్యంగా భట్టి తెలిపారు. వైయస్ లాంటి నాయకుడు మన నుంచి దూరంకావడం దురదృష్టమన్న భట్టి.. అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేమన్నారు.
షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై భట్టి ఏమన్నారంటే
“వైయస్ఆర్‌పై అభిమానంతో ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నివాళులు మాత్రమే అర్పించాలి, ఈ స్థలంలో నిల్చుని రాజకీయాలు మాట్లాడటం మంచి సంప్రదాయం కాదు. రాజకీయాల గురించి తప్పనిసరిగా బయట మాట్లాడతాను” అని భట్టి విక్రమార్క తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..