Andhra Pradesh: గుడివాడ టికెట్ ఆయనకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన స్థానాలకు అభ్యర్థుల ఎంపికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేగవంతం చేశారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానాల్లో గన్నవరం, గుడివాడ ముఖ్యమైనవి. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఒకప్పుడు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వారు ఉన్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని ఇద్దరూ కూడా టీడీపీ రాజకీయ జీవితం ప్రారంభించినవారే.

Andhra Pradesh: గుడివాడ టికెట్ ఆయనకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం..
Chandrababu
Follow us
pullarao.mandapaka

| Edited By: Aravind B

Updated on: Sep 02, 2023 | 4:50 PM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన స్థానాలకు అభ్యర్థుల ఎంపికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేగవంతం చేశారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానాల్లో గన్నవరం, గుడివాడ ముఖ్యమైనవి. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఒకప్పుడు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వారు ఉన్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని ఇద్దరూ కూడా టీడీపీ రాజకీయ జీవితం ప్రారంభించినవారే. వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అందుకే ఈ ఇద్దరినీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గడప తొక్కకుండా చూడాలని గట్టి పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే గన్నవరం నుంచి వంశీకి పోటీగా యార్లగడ్డ వెంకట్రావు‎కు టిక్కెట్ కన్ఫర్మ్ చేశారు. మరో స్థానం గుడివాడ. ఒకప్పుడు టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచి ఆ తర్వాత వైసీపీలో చేరారు కొడాలి నాని. వరుసగా వైసీపీలో కూడా రెండుసార్లు గెలిచారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానిని ఢీకొట్టాలంటే సామాజికంగా,ఆర్థికంగా బలమైన నేత ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు ఉన్నారు. ఈయనతో పాటు మరో ఎన్నారై వెనిగండ్ల రాము కూడా గతేడాది దసరా నుంచి టీడీపీలో చురుకుగా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరూ కూడా టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో టిక్కెట్ ఎవరికి ఇవ్వాలి అనేదానిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

కొడాలి నానిని ఢీ కొట్టేందుకు చంద్రబాబు పక్కా స్కెచ్ ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వర రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యే గా గెలిచారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన వెనిగండ్ల రాము… స్వస్థలానికి వచ్చి ఈసారి టిక్కెట్ ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. రావి వెంకటేశ్వరరావుతో సమానంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలతో ప్రజలోనే ఉంటున్నారు. సుమారు ఏడాదిగా అన్న క్యాంటీన్ లు, పండగలకు దుస్తుల పంపిణీ, జాబ్ మేళాలు నిర్వహించడం,ఇటీవల వరదలు వచ్చినప్పుడు రైతులను పరామర్శించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాలా దగ్గరయ్యారు రాము. దీంతో రావి, వెనిగండ్ల విషయంలో ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో టిక్కెట్‎పై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారట. దీంతో రావి వెంకటేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. తాజా నివేదికలను రావి వెంకటేశ్వరరావు ముందు ఉంచారట చంద్రబాబు. కొడాలి నానికి సరైన ప్రత్యర్థిగా వెనిగండ్ల రాముకే నివేదికలు అనుకూలంగా ఉన్నట్లు రావికి చెప్పినట్లు తెలిసింది. వెనిగండ్ల రాముకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా సామాజిక వర్గాల పరంగాను ఇతర కోణాల్లోనూ నానిని ఢీకొట్టగల సత్తా ఉందని చెప్పారట బాబు. ఇదే సమయంలో రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ లేదా మరో మంచి పదవి ఇచ్చి న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పినట్లు సైకిల్ పార్టీ నేతలు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో కొడాలి నానికి పోటీగా దేవినేని అవినాష్‎ను బరిలోకి దించారు చంద్రబాబు. అయితే దేవినేని అవినాష్ స్థానికేతరుడు. నియోజకవర్గంపై పట్టు లేదంటూ కొడాలి నాని ప్రచారం చేశారు. నాన్ లోకల్ ఇష్యూతో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిందని నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. ఈసారి అలాంటి సమస్య లేకుండా వెనిగండ్ల రామును బరిలోకి దింపితే కచ్చితంగా సీటు గెలుస్తామనే అభిప్రాయానికి వచ్చారట బాబు. స్థానికుడు కావడం.. ఇప్పటికే అన్ని వర్గాలతో కలిసిపోవడం, ఆర్థికంగా కూడా బలంగా ఉండటం వెనిగండ్ల రాముకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక కొడాలి నాని హయాంలో గుడివాడ అభివృద్ధి జరగలేదని టీడీపీ ప్రచార అస్త్రంగా చేసుకుంది. తాను గెలిస్తే గుడివాడను ఎలా అభివృద్ధి చేస్తాను అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రాము. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాముకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే వెనిగండ్ల రాముకు గుడివాడ ఇంఛార్జి బాధ్యతలు కూడా అప్పగిస్తారని సమాచారం. మొత్తానికి ఒక పక్క గన్నవరం,మరోపక్క గుడివాడ లో ఈసారి ఎన్నిక లు హోరాహోరీ జరిగే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..