Okra Price: గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్న బెండ రైతు.. టన్నుల కొద్దీ బెండకాయల నీటి పాలు
మొన్నటి వరకూ టమాటా రైతు ఇంట సిరులు కురిపించిన టమాటా ధర ఇప్పుడు అది కూడా నేలచూపులు చూస్తోంది. ఇప్పుడు బెండకాయ వంతు వచ్చింది. తాజాగా బెండకాయలు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్నాడు. బెండకాయ ధర పతనమవడంతో రైతులు సంక్షోభంలో పడ్డారు. బహిరంగ మార్కెట్ లో బెండకాయ రూ. 40 లు ఉంటున్నా.. రైతులకు మాత్రం కిలో రూ.2 మాత్రమే లభిస్తోంది.
కొన్ని రోజుల క్రితం వరకూ టమాటో పాటు అనేక రకాల కూరగాయల ధరలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వంటి వస్తువుల ధరలు చుక్కలను దాటి సామాన్యుల జేబులకు చిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కొంతమంది టమాటా రైతులు లాభపడ్డారు కూడా.. అయితే క్రమంగా కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. వినియోగదారులకు ఇది తీపి కబురే అయినా కష్టపడి పండించిన రైతు కన్నీటిపర్యంతమవుతున్నాడు. మొన్నటి వరకూ టమాటా రైతు ఇంట సిరులు కురిపించిన టమాటా ధర ఇప్పుడు అది కూడా నేలచూపులు చూస్తోంది. ఇప్పుడు బెండకాయ వంతు వచ్చింది.
తాజాగా బెండకాయలు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్నాడు. బెండకాయ ధర పతనమవడంతో రైతులు సంక్షోభంలో పడ్డారు. బహిరంగ మార్కెట్ లో బెండకాయ రూ. 40 లు ఉంటున్నా.. రైతులకు మాత్రం కిలో రూ.2 మాత్రమే లభిస్తోంది. ”రెండు నెలలుగా కష్టపడుతున్నాం.. అయినప్పటికీ కనీసం పెట్టిన ఖర్చులు కూడా లభించడం లేదని వాపోతున్నారు. దీంతో తమ పంటను తామే చేతులారా నీటి పాలు చేస్తున్నాడు.
తమిళనాడు తిరుపత్తూర్ మార్కెట్ యార్డ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిలో బెండకాయలు రెండు రూపాయలు పలకుతుండటంతో రైతు నోటమాట రాలేదు. ఎన్నోఆశలతో పండించిన పంటకు పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ యువ రైతు తీవ్ర అసహనంతో నిగనిగలాడే 5 టన్నుల బెండకాయలను నీటిలో పడేశాడు. రైతు కష్టం నీటిపాలైంది. నీటిలో తేలుతున్న టన్నులకొద్దీ బెండకాయలు చూస్తే రైతు ఎంత ఆవేదన చెందాడో అర్ధమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసి రైతు ఆవేదన అర్ధమైన కొందరు ప్రభుత్వం రైతును ఆదుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..