Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. నివేదికలు చెబుతున్న వివరాలివే..

Hyderabad: తీవ్ర సంచలనం సృష్టించిన ‘డ్రమ్ములో డెడ్ బాడి’ కేసు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. పూరన్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ మహిళ యూపీకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు.. తన ప్రేమను తిరస్కరించాడు అని పథకం ప్రకారం యూపీ నుండి వచ్చి హైదరాబాద్‌లో పూరాన్ సింగ్‌ను హత్య చేసి డ్రమ్ములో కుక్కి..

Hyderabad: ఆ రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారు.. నివేదికలు చెబుతున్న వివరాలివే..
Representative Image
Follow us
Peddaprolu Jyothi

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 02, 2023 | 1:58 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాలు, దొంగతనాలు,గంజాయి రవాణా, హత్యలు, అత్యాచారాలు వంటి కేసుల్లో అత్యధికంగా యూపీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, ఎంపీ,పంజాబ్ తదితర రాష్ట్రలకు చెందిన వారే ఎక్కువుగా నిందితులుగా తేలుతున్నారు. హైదరాబాద్ మహా నగరానికి పొట్టకూటి కోసం అంటూ పనుల నిమిత్తం వచ్చి ఎదురు తిరిగితే హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో మూడు కమిషనరేట్ పోలీసులు పనుల నిమిత్తం వచ్చే వారిపై ఫోకస్ పెట్టారు.

డ్రమ్ములో డెడ్ బాడి.. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. పూరన్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో జయదేవి అనే మహిళ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ మహిళ యూపీకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు.. తన ప్రేమను తిరస్కరించాడు అని పథకం ప్రకారం యూపీ నుండి వచ్చి హైదరాబాద్‌లో పూరాన్ సింగ్‌ను హత్య చేసి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసింది.

ఇంకా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మైనర్ బాలుడి ని హత్య చేసిన ఘటన మైలరదేవ్ పల్లి రాణా పరిధిలో చోటుచేసుకుంది.. బీహార్ నుండి పనుల నిమిత్తం వచ్చిన పంకజ్ పాష్వన్ అనే వ్యక్తి రాజా పాష్వన్ అనే మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. ఈ కేసులో కూడా బీహార్ నుండి వచ్చిన వ్యక్తి బాలుదీని హత్య చేయడంతో స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

అలాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నానక్ రాం గూడలో ఓ మహిళ మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితిలో కనిపించింది.. మహిళను పై అత్యాచారం చేసి బండ రాయితో మోది హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు దర్యాప్తు చేయగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద పనిచేస్తున్నటువంటి బెంగాల్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళను మద్యం మత్తులో అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు దీంతో ఇద్దరు నిందితుల అరెస్టు చేసిన పోలీసులు వారు పనుల నిమిత్తం నగరానికి వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు.

ఇక గంజాయి సైబర్ క్రైమ్ నేరాలు సంబంధించి ఎక్కువగా రాజస్థాన్ ఢిల్లీ నుంచి సైబర్ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా నేరగలలో పడుతూనే ఉన్నారు నగర ప్రజలు మరోవైపు ఒడిస్సా నుంచి విపరీతంగా గంజా రవాణా జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పటికే కొన్ని బందల కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేస్తున్నప్పటికీ కొత్త పద్ధతుల ద్వారా ప్రమాణాలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు ఈ విధంగా మూడు కమిషనర్ల పరిధిలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.