AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL Vs BAN: లంకేయుల ముందు తేలిపోయిన బంగ్లాదేశ్.. ‘నాగిన్’ డ్యాన్స్ వేసేందుకు శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

SL vs BAN: ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ 164 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే లంక బౌలర్లలో మథీష పతిరణ 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్ తీక్షణ 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలనుకున్న బంగ్లాదేశ్.. 42.4 ఓవర్లలోనే 10 వికెట్లు కోల్పోయింది. షకిబ్ అల్ హాసన్ నేతృత్వంలోని బంగ్లా టీమ్ తరఫున నజ్ముల్ హుస్సేన్..

SL Vs BAN: లంకేయుల ముందు తేలిపోయిన బంగ్లాదేశ్.. ‘నాగిన్’ డ్యాన్స్ వేసేందుకు శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
SL vs BAN, Asia Cup 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 31, 2023 | 7:10 PM

SL Vs BAN: ఆసియా కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోన్న శ్రీలంక.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా టీమ్ 164 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ‘నాగిన్’ డ్యాన్స్ వేసేందుకు లంక జట్టు కేవలం 165 పరుగుల దూరంలోనే ఉంది. అయితే అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలనుకున్న బంగ్లాదేశ్.. 42.4 ఓవర్లలోనే 10 వికెట్లు కోల్పోయింది. షకిబ్ అల్ హాసన్ నేతృత్వంలోని బంగ్లా టీమ్ తరఫున నజ్ముల్ హుస్సేన్(89) మినహా మిగిలిన వారెవరూ రాణించలేకపోయారు. కెప్టెన్ హాసన్ కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇలా బంగ్లా జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో లంక బౌలర్లు సఫలమయ్యారు. ఈ క్రమంలో లంక తరఫున మథీష పతిరణ 4 వికెట్లతో విజృంభించగా.. మహీష్ తీక్షణ 2 వికెట్లు.. ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలగే, కెప్టెన్ దసున్ షనక తలో వికెట్ తీసుకున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో విజయం కోసం దసున్ షనక నేతృత్వంలోని లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 165 పరుగులు చేయాల్సి ఉంది. అంటే నాగిన్ డ్యాన్స్‌ వేసేందుకు లంక జట్టు 165 పరుగుల దూరంలో, అలాగే బంగ్లాదేశ్ 10 వికెట్ల దూరంలో ఉన్నాయి.

గెలిచిన వారిదే ‘నాగిని’..

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు..

బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హాసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దాసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మథీష పతిరణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..