Hyderabad: ‘సార్..! నా పిల్లి పోయింది.. వెతికి పెట్టండి’ పోలీసులకు మహిళ ఫిర్యాదు
పిల్లలు తప్పిపోతే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వడం చూసాము కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు పిల్లులు, కుక్కలు, ఇలా పెంపుడు జంతువులు ఏవి తప్పిపోయిన తమ పిల్లి మిస్ అయిందని పెంచుకున్న కుక్క మిస్ అయిందని పోలీస్ స్టేషన్కు ఈమధ్య కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెంపుడు జంతువులను పెంచుకోవడంలో..

హైదరాబాద్, సెప్టెంబర్ 2: పిల్లలు తప్పిపోతే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ్వడం చూసాము కానీ ట్రెండ్ మారింది. ఇప్పుడు పిల్లులు, కుక్కలు, ఇలా పెంపుడు జంతువులు ఏవి తప్పిపోయిన తమ పిల్లి మిస్ అయిందని పెంచుకున్న కుక్క మిస్ అయిందని పోలీస్ స్టేషన్కు ఈమధ్య కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెంపుడు జంతువులను పెంచుకోవడంలో మక్కువ చూపిస్తున్నా జంతు ప్రేమికులు ఇంట్లో ఉండే మనుషులకు ఎంత స్థానాన్ని కల్పిస్తారో అంతకంటే ఎక్కువగానే పెంపుడు జంతువులకు ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు.
తామెక్కడికి వెళితే అక్కడికి పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్తున్నారు ఇక కొంతమంది అయితే వాటిని చంటి పిల్లలను ఏ విధంగా అయితే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారో ఆ విధంగా పిల్లుల పుట్టినరోజులు క్షణకాల పుట్టినరోజులు ఈ విధంగా ప్రతి ఒక్కడిని సెలబ్రేట్ చేస్తూ పెంపుడు జంతువులు అంటే మాకు ప్రాణం అనేలాగా ఉంటారు అంతే కాకుండా వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు కొంతమంది అలాంటిది ఒక్కసారిగా పెంచుకున్నటువంటి జంతువు కనిపించకపోతే ఇంట్లో మనిషి కనిపించకపోతే పెంచుకున్నటువంటి పెంపుడు జంతువు ఏ విధంగా అయితే బాధపడుతూ ఉంటరో అంతకన్నా ఎక్కువగానే వాటితో అటాచ్ మెంట్ పెంచుకున్నటువంటి జంతు ప్రేమికుల సైతం కొంతసేపు అవి పెంచుకున్న జంతువు కనిపించకపోతే బోరున విలపిస్తారు తాజాగా నేరేడ్మెట్ లో తన పిల్లి పోయింది అని ఓ మహిళ పోలీసులు ఆశ్రయించింది.
తమ పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని. ఆలస్యంగా వెలుగులోకి వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ విద్యా నగర్ మనీషా మీనన్ అనే మహిళ తన ఇంట్లో గత మూడు సంవత్సరాలుగా పెంపుడు పిల్లిని సాకుతుంది. అయితే ఆగస్టు నెల 28వ తేదీన రాత్రి తమ తెల్ల రంగు పిల్లి ఇంట్లో నుండి వెళ్లిపోయిందని ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పిల్లి మూడు నెలల గర్భవతి అని దయచేసి తమ పిల్లిని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పిల్లి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.



