Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSR Death Anniversary: తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళులు.. కాంగ్రెస్ పార్టీలో వైయస్ఆర్టిపి పార్టీ విలీనంపై షర్మిల ఏమన్నారంటే..?

14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైయస్ ఆర్ ఇంకా బ్రతికే ఉన్నారని, వైయస్ అద్బుతమైన పధకాలు ద్వారా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన కుమార్తె , వైయస్ ఆర్ టిపి అధినేత షర్మిల అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా షర్మిల తో పాటు వైఎస్ విజయమ్మ మరియు కుటుంబ సభ్యులు , వైయస్సార్ టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

YSR Death Anniversary: తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళులు.. కాంగ్రెస్ పార్టీలో వైయస్ఆర్టిపి పార్టీ విలీనంపై షర్మిల ఏమన్నారంటే..?
Ysr Death Anniversary
Follow us
Sudhir Chappidi

| Edited By: Surya Kala

Updated on: Sep 02, 2023 | 12:06 PM

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ లో వైఎస్ సమాధి వద్ద ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నివాళులర్పించారు. షర్మిల తో పాటు వైఎస్ విజయమ్మ మరియు కుటుంబ సభ్యులు , వైయస్సార్ టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైయస్ ఆర్ ఇంకా బ్రతికే ఉన్నారని, వైయస్ అద్బుతమైన పధకాలు ద్వారా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన కుమార్తె , వైయస్ ఆర్ టిపి అధినేత షర్మిల అన్నారు. వైయస్ ఆర్ రైతు పక్షపాతిగా ఉండి , విద్యుత్ బకాయిలను మాఫీచేసి, ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన మహా నేత అని , పావలా వడ్డీ ద్వారా మహిళలను ఆదుకుని ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపారన్నారు.

పేద విద్యార్దులకు ఏ చదువు చదవడానికైనా వీలుండేలా ఫీజ్ రీ అంబర్స్ మెంట్ పెట్టి ఎంతోమంది యువతను ప్రయోజకులను చేశారన్నారు. 108, ఆరోగ్యశ్రీ ద్వారా కోట్ల మంది ప్రాణాలు నిలిపారని, కులమతాలకు , పార్టీలకు అతీతంగా పధకాలు అందించి ఏపక్షపీతం లేని మహా నేతగా వైయస్ నిలిచిపోయారన్నారు. వైయస్ ఆర్ చనిపోయినప్పుడు ఆ భాద తట్టుకోలేక 700మంది గుండెలు ఆగింపోయాయని, వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ వైయస్ ఆర్ బిడ్డగా వారి త్యాగాలు మరిచిపోనని షర్మిల అన్నారు ..

పార్టీ విలీనంపై షర్మిల

ఇది వైయస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అందుకే ఇక్కడ రాజకీయాలు మాట్లాడని షర్మిల స్పష్టం చేశారు పార్టీ విలీనంపై ఇక్కడ మాట్లాడటం సభ్యత కాదని అందుకే ఇక్కడ మాట్లాడటం లేదని షర్మిల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..