Telangana: కర్మఫలం అంటే ఇదేనేమో..! ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోయేందుకు వెళుతూ..
నిజామాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ - దీపిక లు గత నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఆదిలాబాద్ లోని బంగారుగూడ కాలనీకి వలస వచ్చారు. వారి కాపురం మూడు నెలలు ముచ్చటగా సాగింది. అంతలోనే ఏమైందో కానీ భార్యభర్తల మద్య కలహాల కాపురం కొనసాగింది. అయితే గత రాత్రి భార్యభర్తల మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో క్షణికావేశంలో భార్య దీపిక ను భర్త అరుణ్ హత్య చేశాడు.
భారతీయులు ముఖ్యంగా హిందూ, భౌద్ధ, జైన మతాల వంటి వారు కర్మను నమ్ముతారు. మనం చేసే కర్మలే అందుకు తగిన ఫలితాలను ఇస్తాయని విశ్వాసం కూడా.. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది తాజాగా జరిగిన ఓ సంఘటన.. అవును అనుమానం పెను భూతమైంది.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం భార్య ప్రాణాలను గాల్లో కలిపితే అదే ఆవేశం అతడిని సైతం బలి తీసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ – దీపిక లు గత నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఆదిలాబాద్ లోని బంగారుగూడ కాలనీకి వలస వచ్చారు. వారి కాపురం మూడు నెలలు ముచ్చటగా సాగింది. అంతలోనే ఏమైందో కానీ భార్యభర్తల మద్య కలహాల కాపురం కొనసాగింది. అయితే గత రాత్రి భార్యభర్తల మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో క్షణికావేశంలో భార్య దీపిక ను భర్త అరుణ్ హత్య చేశాడు. ఆ వెంటనే ఇంటి నుండి వెళ్లిపోయిన అరుణ్ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెంది కనిపించాడు.
భార్యను హత్య చేశాక పోలీసులకు లొంగిపోయేందుకు ఆదిలాబాద్ బయలు దేరిన అరుణ్ ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఓ జిన్నింగ్ మిల్ వద్ద ఆపి ఉన్న ఓ లారీ ని వెనుక నుండి బైకు తో బలంగా ఢీ కొనడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక భార్య ను చంపడంతో పోలీసులకు లొంగిపోతే జైలు శిక్ష తప్పదన్న భాదలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది. మొత్తానికి నాలుగు నెలల క్రితమే ఏడేడు జన్మలు కలిసుంటానని బాస చేసి మూడు ముళ్లు వేసిన అరుణ్ దీపికల బంధం మూన్నేళ్లల్లో ముగిసిపోయింది. వివరాలు తెలుసుకున్న ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..