Fraud Alert: ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త మోసం.. ఒక్క ఓటీపీతోనే లక్షలు మాయం చేస్తున్న కేటుగాళ్లు..

ట్రాఫిక్ పోలీసులు పంపించిన విధంగా ఒక పేమెంట్ లింక్ ని క్లిక్ చేసి మీ చలాన్ క్లియర్ చేసుకోండి ఒక టెక్స్ట్ మెసేజ్ ని కేటుగాళ్లు పంపిస్తున్నారు. నిజంగానే ట్రాఫిక్ చలాన్ ఉందేమో అనుకుని ఆ లింకును క్లిక్ చేసిన వెంటనే తమ అకౌంట్లో నుండి డబ్బు మాయమైపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఫేక్ చలాన్ పేమెంట్ లింకులపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం.

Fraud Alert: ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త మోసం.. ఒక్క ఓటీపీతోనే లక్షలు మాయం చేస్తున్న కేటుగాళ్లు..
Traffic Challana Fraud
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Surya Kala

Updated on: Sep 02, 2023 | 9:12 AM

ప్రతి రోజు ఒక కొత్త పంథా తో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు..ఒక్క otp తో లక్షలు కాజేస్తునారు..ఎక్కడ ఉంటారో తెలీదు…ఎలా ఉంటారో తెలీదు కానీ మన బ్యాంక్ ఖాతాల నుండి మాత్రం లక్షల కొద్ది లక్షలు మాయం చేసేస్తున్నారు…మనకి తెలీకుండానే మనతోనే మన otp చెప్పించుకుని ఖాతాకు కొల్లగొడుతున్నారు… తాజగా చాలాన్ కట్టాలంటే మెసేజ్లు పంపుతూ బాధితుల ఖాతాలకు చిల్లు పెడుతున్నారు.. ఈ తరహా ఫ్రాడ్స్ హైదరాబాద్ సిటీలో చాలా జరుగుతున్న ఫిర్యాదు చేసేందుకు బాధితులు మాత్రం ముందుకు రావడం లేదు.. సాధారణంగా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించగానే ట్రాఫిక్ సిబ్బంది క్యాప్చూర్ చేసే కెమెరాల ద్వారా మన వాహనానికి చలాన్ విధిస్తారు. ఆ చలానికి సంబంధించిన ఫైన్ మనకి మెసేజ్ రూపంలోనూ ట్రాఫిక్ పోలీసులు పంపిస్తుంటారు. అయితే ఇటీవల చాలా వరకు ట్రాఫిక్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మన వాహనంపై చలాన్ ఉంటే ట్రాఫిక్ సిబ్బంది మన వాహనాన్ని పక్కకు ఆపి వాళ్లు పంపించిన పేమెంట్ లింక్ ద్వారా మన చల్లాన్ క్లియర్ అయ్యే చర్యను చేపడుతున్నారు. ఆ పేమెంట్ లింక్ క్లిక్ చేయగానే మన చలాన్ పే చేసే పేజి ఓపెన్ అవుతుంది.. తద్వారా మన పెండింగ్ చలాన్ క్లియర్ చేయబడుతుంది.

ఇప్పుడు ఇదే అవకాశాన్ని మలుచుకున్న సైబర్ కేటుగాళ్లు ట్రాఫిక్ చలాన్ల పేరుతో కొత్త తరహా నేరానికి తెరలేపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పంపించిన విధంగా ఒక పేమెంట్ లింక్ ని క్లిక్ చేసి మీ చలాన్ క్లియర్ చేసుకోండి ఒక టెక్స్ట్ మెసేజ్ ని కేటుగాళ్లు పంపిస్తున్నారు. నిజంగానే ట్రాఫిక్ చలాన్ ఉందేమో అనుకుని ఆ లింకును క్లిక్ చేసిన వెంటనే తమ అకౌంట్లో నుండి డబ్బు మాయమైపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఫేక్ చలాన్ పేమెంట్ లింకులపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి నేరాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం.

అయితే ఇటువంటి ఫ్రాక్స్ జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలని దానిపై ట్రాఫిక్ పోలీసులు ఒక సూచన చేశారు. ఏదైనా అనుమానాస్పద ట్రాఫిక్ చలాన్ లింక్ వచ్చినప్పుడు నేరుగా తెలంగాణ స్టేట్ ఈ చలాన్ వెబ్సైట్ కి వెళ్లి పేమెంట్ చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.. టీఎస్ ఈ చలాన్ వెబ్సైట్ కి వెళితే మన వాహనం నంబర్ కొట్టగానే ఎన్ని చలానాలు ఉన్నాయో చూపించటంతో పాటు వాటిని క్లియర్ చేసుకునే వెసులుబాటు సైతం ఆ వెబ్సైట్లో ఉందంటున్నారు పోలీసులు.. చలాన్స్ పేమెంట్ కి సంబంధించిన మెసేజ్ లింక్ వస్తే క్రాస్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..