Mahanandi Temple: మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి హల్‌చల్.. తీవ్ర భయాందోళనలో భక్తులు, స్థానికులు
ఇటీవల తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసి ప్రాణాలు తీసింది. టీటీడీ, అటవీ అధికారులు చిరుతలు, ఎలుగుబంట్లను పట్టుకునేందుకు 300 నిఘా కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి జంతువులను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నిన్న తిరుమలలో ఓ చిరుత బోనులో చిక్కింది. ఇంకా ఎలుగుబంటి జాడ తెలియలేదు. ఇప్పడు నంద్యాలలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పుణ్యక్షేతలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపొయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేతలకు వెళ్తున్నారు. ఇటీవల తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసి ప్రాణాలు తీసింది. టీటీడీ, అటవీ అధికారులు చిరుతలు, ఎలుగుబంట్లను పట్టుకునేందుకు 300 నిఘా కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి జంతువులను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నిన్న తిరుమలలో ఓ చిరుత బోనులో చిక్కింది. ఇంకా ఎలుగుబంటి జాడ తెలియలేదు. ఇప్పడు నంద్యాలలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది.
అవును.. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం పరిసరప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తోందని.. ఈ తెల్లవారుజామున మహానంది క్షేత్రంలోని పెద్ద నంది, కరివేన సత్రం వద్ద ఎలుగుబంటి కనిపించిందని ఆలయ అధికారులు తెలిపారు. వెంటే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రాలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్ధానికులను ఆందోళనుకు గురిచేస్తున్నాయి.
క్షేత్రం విశిష్టత
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం.. మహానంది ..14 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నవ నంది క్షేతాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మహానంది. ఈ క్షేత్రంలో మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. 7వ శతాబ్దంలో నిర్మిచినట్లు ఇక్కడ శాసనాల ద్వారా అనేక సార్లు మతమత్తులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మహానందీశ్వరాలయం శిల్ప శైలి మహాద్భుతం అని.. బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలమైన 680-696 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల అంచనా. ప్రధాన ఆలయంలో పూజలను అందుకుంటున్న శివలింగం మిగతా క్షేత్రాల్లోని శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది.
పుష్కరిణిలో నీటి స్వచ్ఛత
ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిలనుండి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. నీరు ఎప్పుడూ ఊరుతూ వుంటుంది. ఈ పుష్కరిణిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది.. ఎంతగా అంటే.. నీటిలో కదలికలు లేకుండా ఉంటె.. అసలు ఆ పుష్కరిణిలో నీరు ఉన్నట్లు కూడా అనిపించదు. ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయి. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనిపించేలా ఉండడం ఈ పుష్కరిణిలో నీటి స్పెషాలిటీ..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..