Andhra Pradesh: కత్తితో బ్యాంకుకు వచ్చాడు.. దర్జాగా దోచుకెళ్లాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరించి ఓ దొంగ రూ.6.50 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనం మాట అటుంచి అసలు పట్టపగలు ఏకంగా బ్యాంకులో దూరిన ఒక దొంగ నగదు దోచుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకులో చోరీ అంటే ఎంతో ప్లానింగ్ చేసుకుని ఒక పథకం ప్రకారం దోచుకుంటారు. కానీ ఇక్కడ బ్యాంకులో చోరీ చాలా సింపుల్గా జరిగిపోయింది.

బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరించి ఓ దొంగ రూ.6.50 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. దొంగతనం మాట అటుంచి అసలు పట్టపగలు ఏకంగా బ్యాంకులో దూరిన ఒక దొంగ నగదు దోచుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకులో చోరీ అంటే ఎంతో ప్లానింగ్ చేసుకుని ఒక పథకం ప్రకారం దోచుకుంటారు. కానీ ఇక్కడ బ్యాంకులో చోరీ చాలా సింపుల్గా జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సైతం పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆ దొంగ ఎలా దొంగతనం చేశాడు. దొంగతనం చేసే సమయంలో అతను ఎవరు నిలవరించలేదా.. దొంగ నగదు దోచుకు వెళుతుండగా బ్యాంకుకు కాపలాగా ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఏమయ్యారు.. ఇలా అనేక సందేహాలు స్థానికల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ బ్యాంకు దోపిడీ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటుచేసుకుంది.
నరసాపురంలో రెడ్డప్ప వారి వీధిలో ఎస్బీఐ బ్రాంచ్ ఉంది. మధ్యాహ్నం సమయం కావడంతో బ్యాంక్ మేనేజర్ ప్రేమ్ కుమార్ ఇంటికి భోజనానికి వెళ్లారు. ఇక బ్యాంకులో మెయిన్ క్యాషియర్ కనకదుర్గ, మరో క్యాషియర్ శిరీష, మెసెంజర్ డేసిప్లారేన్స్ అనే ఈ ముగ్గురు మహిళ సిబ్బంది మాత్రమే బ్యాంకులో ఉన్నారు. అప్పుడే అక్కడ పెద్ద వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో పెద్దగా జనసంచారం కూడా ఎక్కువగా ఉండదు. దాన్ని అవకాశం తీసుకున్నాడు ఆ దొంగ. మెయిన్ క్యాషియర్ కనకదుర్గ తన ఛాంబర్లో కూర్చుని మెసెంజర్ తో కలిసి క్యాష్ ను లెక్కిస్తున్నారు. ఆ సమయంలో ఆ దొంగ తన ముఖం కనపడకుండా జేబురుమాలు కట్టుకొని తలపై టోపీ ధరించి, చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని కనకదుర్గ ఛాంబర్లోకి వెళ్లి బంగారంపై లోన్ కావాలని అడిగాడు.
అయితే ఆమె బంగారం పరీక్షించే ఉద్యోగి రావాలని, అతను వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న బంగారాన్ని పరీక్షించి లోన్ ఇస్తామని చెప్పింది. అతను వచ్చేవరకు అక్కడే వెయిట్ చేస్తానని దొంగ బదులిచ్చి మెసెంజర్ పక్కన ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాడు. మెసెంజర్ తన ముఖానికి ఉన్న జేబురుమాలును తొలగించాలని సూచించిన తనకు అనారోగ్యంగా ఉందంటూ ఆ దొంగ వారికి బదులిచ్చాడు. నగదు లెక్క పెట్టే దగ్గర ఎవరు ఉండకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ దొంగ పైకి లేచి తన వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి పొడవాటి కత్తి బయటకు తీసి వారిని బెదిరించాడు. దాంతో వారు భయంతో కేకలు వేశారు.
వీడియో చూడండి..
ఈ లోపు ఆ దొంగ టేబుల్ పై ఉంచి లెక్కిస్తున్న రూ.7.50 లక్షల నగదును హడావుడిగా తన బ్యాగులో వేసుకొని అక్కడ నుంచి పారిపోతుండగా బ్యాగ్ లో నుంచి రూ.500 నోట్ల కట్టలు రెండు కింద పడిపోయాయి. దాంతో మిగిలిన రూ.6.50 లక్షల నగదుతో అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే, దొంగతనం దృశ్యాలన్నీ మెయిన్ క్యాషియర్ కనకదుర్గ చాంబర్ లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. కానీ బ్యాంకు బయట సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ దొంగ ఎటువైపు వెళ్ళాడో తెలియలేదు. అసలు ఆ బ్యాంకుకి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా లేదా అని డౌట్ స్థానికుల్లో కలుగుతుంది.
ఒకవేళ సెక్యూరిటీ సిబ్బంది ఉంటే అతను అడ్డుకునే వాడు కదా.. అనే పలు రకాల సందేహాలు కలుగుతున్నాయి. అయితే బ్యాంకులో చోరీ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బ్యాంకులో ఎవరూ లేకుండా కేవలం ముగ్గురు మహిళా ఉద్యోగులు మాత్రమే ఉన్న సమయంలో పట్ట పగలు, బ్యాంకులోకి వచ్చి కత్తితో బెదిరించి చోరీ చేయడం, బ్యాంక్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, రక్షణగా వుండాల్సిన సెక్యూరిటీ గార్డ్ లేకపోవడం.. చూస్తుంటే.. ఈ దొంగతనం వెనక ఎవరి హస్తమైన ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..