AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఫిర్యాదు

చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో మధ్యంతర బెయిల్‌తో కాస్త ఊరట లభించిందో లేదో వరుసగా మరిన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్ ర్యాలీకి సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుతో పాటూ మరొక కేసు నమోదైంది. ఇటు తెలంగాణలోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లలో మరో కేసు నమోదు చేసింది ఏపీఎమ్‌డీసీ. దీంతో ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

Chandrababu: చంద్రబాబుపై మరో కేసు.. ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఫిర్యాదు
Ap Cid Registered Another Case Against Chandrababu In The Case Of Sand Irregularities
Srikar T
|

Updated on: Nov 02, 2023 | 5:42 PM

Share

చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో మధ్యంతర బెయిల్‌తో కాస్త ఊరట లభించిందో లేదో వరుసగా మరిన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న హైదరాబాద్ ర్యాలీకి సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుతో పాటూ మరొక కేసు నమోదైంది. ఇటు తెలంగాణలోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లలో మరో కేసు నమోదు చేసింది ఏపీఎమ్‌డీసీ. దీంతో ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసులో ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీతల సుజాతా ఏ1, చంద్రబాబు నాయుడు ఏ2, చింతమనేని ప్రభాకర్ ఏ3, దేవినేని ఉమాలు ఏ4గా ఉన్నారు. వీరు అక్రమ మైనింగ్‌ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిపారని తెలిపారు. గతంలో చంద్రబాబు చేసిన పర్యావరణ నష్టానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 100 కోట్లు జరిమానా విధించింది.

ఉచితంగా పేదలకు ఇసుక అందిస్తామన్న ముసుగులో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించి అదినంత దోచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచితంగా ఎంత మంది పేదలకు ఇసుకను అందించారో రికార్డ్ బయటకు తీయాలని తెలిపారు. రాష్ట్రంలో 1000కు పైగా అక్రమ ఇసుక మైనింగ్ కేసులు నమోదయ్యాయి. వసూలు చేసిన పెనాల్టీ విలువ రూ. 40 కోట్లు ఇది సంబంధించి వివరాలను, వాటి లెక్కలను చూపించాలని ఇందులో చేర్చారు. “ఉచిత ఇసుక విధానం” ద్వారా ఖనిజ వనరుల దోపిడీదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలు కోట్లాది రూపాయలు చెల్లించలేదన్నారు. తమ పార్టీలోని రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని చెబుతూ మరిన్ని అంశాలు పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.