AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘ఆ బ్లాక్ బాస్టర్ పాత్రను ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. తను నమ్మి చేసింది..’

దర్శకుడు అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని వివరించారు. రచనా నైపుణ్యాలు తనకు ఎలా సహాయపడ్డాయో తెలిపారు. అలానే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు తనతో ఆర్టిస్టులు ఎలా ఉండేవారు వంటి విషయాలు వెల్లడించారు. అంతేకాదు సంక్రాంతి వస్తున్నాం మూవీలో ....

Tollywood: 'ఆ బ్లాక్ బాస్టర్ పాత్రను ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. తను నమ్మి చేసింది..'
Anil Ravipudi
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2026 | 7:50 PM

Share

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, నటీనటులతో తన అనుబంధం, నటుడు సప్తగిరితో ఉన్న స్నేహం గురించి వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్, రచయితగా తన ప్రారంభ రోజుల గురించి ప్రస్తావించారు. తాను ఆండ్రాయిడ్ లాంటివాడిని, యూజర్ ఫ్రెండ్లీ అని, అందుకే ఆర్టిస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆర్టిస్టులు తనను తక్కువగా చూడటం కానీ, అవమానించడం కానీ జరగలేదని అనిల్ రావిపూడి వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం తన రైటింగ్ స్కిల్స్ అని ఆయన తెలిపారు. తాను ఒకేసారి రచయితగా, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడినని, దీనివల్ల నటీనటులు డైలాగులు, సన్నివేశాలపై డిస్కస్ చేయడానికి తనతో ఎక్కువ సమయం గడిపేవారని చెప్పారు. తన రచన వారికి ఒక కవచంలా ఉపయోగపడిందని, నటులు తమ డైలాగులను మెరుగుపరుచుకోవడానికి తనను ఆశ్రయించేవారని వివరించారు. ఇది వారి స్వార్థం కావచ్చు లేదా తనపై ఉన్న ఇష్టం కావచ్చు, కానీ ఈ కారణంగానే తనకు ఎప్పుడూ అవమానాలు ఎదురు కాలేదని స్పష్టం చేశారు.

ఇక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌ను భాగ్యం పాత్రకు ఎంపిక చేసిన తీరును ఆయన వివరించారు. ఈ పాత్రకు తొలుత ముగ్గురు నలుగురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ, భాగ్యం పాత్రకు చాలా సున్నితమైన నటన అవసరమని, ఒక శాతం అటు ఇటు అయినా పాత్ర పండదని ఆయన తెలిపారు. నలుగురు పిల్లల తల్లి పాత్రను పలువురు నటీమణులు చేయలేమని నిరాకరించినట్లు అనిల్ రావిపూడి పేర్కొన్నారు. అయితే, ఐశ్వర్య రాజేష్‌ కథ విని చాలా ఉత్సాహంగా ఆ పాత్రను ఒప్పుకున్నారు. ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆమె నమ్మిందని, ఆమె తీసుకున్న ఈ ధైర్యమైన నిర్ణయాన్ని దర్శకుడు కొనియాడారు. ఐశ్వర్య రాజేష్‌ తప్ప ఆ పాత్రను 200% ఇంకెవరూ చేయలేరని ఆయన ప్రశంసించారు. ఆమె తెలుగు అమ్మాయి కావడం వల్ల డైలాగ్స్‌కు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా సహజంగా, లైవ్లీగా ఉన్నాయని, వెంకటేష్‌తో ఆమె జోడి సౌందర్య, మీనాతో ఉన్న కెమిస్ట్రీని గుర్తుచేసిందని అనిల్ రావిపూడి వివరించారు. ఫైనల్‌గా వెంకీతో ఆమె కాంబినేషన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని గుర్తు చేశారు..

అలానే నటుడు సప్తగిరి తనకు చాలా సన్నిహిత మిత్రుడని, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ అరెయ్.. ఒరెయ్ అని పిలుచుకునే స్నేహం తమదని వెల్లడించారు. సప్తగిరి సినీ ప్రస్థానంలో అనిల్ రావిపూడి పాత్ర గురించి ఒక సంఘటనను వివరించారు. కందిరీగ సినిమాలో “యాడికిరా పోయేది” అనే ట్రాక్ మొదట అనిల్ రావిపూడి తనకోసం రాసుకున్నారని, దానిని తానే చేయాలనుకున్నారని చెప్పారు. దర్శకుడు వాసు కూడా అంగీకరించారని, అయితే రాత్రి నిద్రపోయే ముందు ఆలోచించుకుని, నటన తన వృత్తి కాదని, ఈ పాత్రను ఒక కొత్త నటుడికి ఇస్తే సహాయం అవుతుందని భావించానని తెలిపారు. వెంటనే సప్తగిరికి ఫోన్ చేసి, మరుసటి రోజు ఉదయం వచ్చి ఆ పాత్ర చేయమని చెప్పానని, అలా సప్తగిరి ఆ క్యారెక్టర్‌తో వెలుగులోకి వచ్చాడని అనిల్ రావిపూడి వివరించారు. సప్తగిరి లెంగ్తీ ఉన్న పాత్రలు అడిగేవాడని.. అందుకే తన సినిమాల్లో అతను పాత్రలు ఇవ్వలేకపోయినట్లు వివరించారు.

కాగా ఈ సంక్రాంతికి న శంకర వరప్రసాద్‌గారు చిత్రంతో పలకరించబోతున్నారు అనిల్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.  

సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
సంక్రాంతికని సొంతూరుకు వచ్చినవారిని.. వెంటాడిన మృత్యువు
ఒరేయ్ ఆజామూ.! కోహ్లీని భలే ఇరికించావ్‌గా.. ఒక్క రెండు రోజులు
ఒరేయ్ ఆజామూ.! కోహ్లీని భలే ఇరికించావ్‌గా.. ఒక్క రెండు రోజులు
స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
స్వీట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?
మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం.. ఎప్పటినుంచంటే..?
మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం.. ఎప్పటినుంచంటే..?
రఘువరన్ బీటెక్ సినిమా మిస్సైన టాలీవుడ్ హీరో..
రఘువరన్ బీటెక్ సినిమా మిస్సైన టాలీవుడ్ హీరో..
వాస్తు సరిగాలేదని ఇంట్లోకి వచ్చారు.. కట్ చేస్తే, గుట్టుగా
వాస్తు సరిగాలేదని ఇంట్లోకి వచ్చారు.. కట్ చేస్తే, గుట్టుగా
ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది..
ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది..
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆ పని చేయలేదా.. ఈ ఆఫర్ పొందలేరు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్‌ కొడుకు