Katrina Kaif: కత్రినా కైఫ్ కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్.. పేరు కూడా భలే క్యాచీగా ఉందే
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ గతేడాది ఆఖరులో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 7వ తేదీన కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటివరకు తన కుమారుడిని చూపించని ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మల్లీశ్వరి సినిమాతోనే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఈ అందాల తార బాలయ్యతో కలిసి అల్లరి పిడుగు సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే స్థిర పడింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇదే క్రమంలో హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో పడింది. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్ 9వ తేదీన పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక తమ దాంపత్య బంధానికి ప్రతీకగా గతేడాది ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. పెళ్లయిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కత్రినా-విక్కీ కౌశల్ లు పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. 2025 నవంబర్ 07వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది కత్రినా. అయితే చాలా మంది సెలబ్రిటీ ల్లాగే కత్రినా దంపతులు కూడా తమ బిడ్డ విషయంలో చాలా ప్రైవసీని పాటిస్తున్నారు. తమ కుమారుడి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఎట్టకేలకు తాజాగా తన కుమారుడిని పరిచయం చేసింది కత్రినా. సోషల్ మీడియా వేదికగా కొడుకు ఫొటోతో పాటు, పేరును కూడా రివీల్ చేసింది.
ఈ సందర్బంగా కత్రినా, విక్కీ కౌశల్ ల చేతిలో తమ కుమారుడి చేయి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేశారీ స్టార్ కపుల్. ‘మా కాంతి కిరణం.. విహాన్ కౌశల్.. మేము చేసిన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఇప్పుడు మా జీవితం చాలా అందంగా ఉంది. ఒక్క క్షణంలో ఈ ప్రపంచం మొత్తం మారిపోయింది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది కత్రినా. అయితే ఈ ఫొటోల్లో తన కొడుకు ఫేస్ మాత్రం రివీల్ చేయలేదీ స్టార్ కపుల్. మొత్తానికి కత్రినా-విక్కీ దంపతుల పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కత్రినా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కత్రినా కైఫ్ పోస్ట్..
View this post on Instagram
కాగా గర్భం ధరించిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కత్రినా కైఫ్. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేస్తుందో లేదో క్లారిటీ ఇవ్వడం లేదీ అందాల తార. మరోవైపు విక్కీ కౌశల్ మాత్రం ఈ ఏడాది ఛావా సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




