Watch Video: ఒక వ్యక్తిని కారుతో తొక్కించి హతమారచిన ఘటన.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bengaluru Car Incident: సాధారణంగా మన చుట్టూ అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లావాదేవీల వెనుక ఒక విషాదం నెలకొంది. తన విలాసానికి కారును కొనుగోలు చేసి ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదనే కారణంగా పరస్పరం గొడవ జరిగింది. ఈ ఆర్థిక వ్యవహారంలో ఇరువురి మధ్య రాజీ కుదరక పోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగర నడిబొడ్డున చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ

Watch Video: ఒక వ్యక్తిని కారుతో తొక్కించి హతమారచిన ఘటన.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
An Incident Where A Man Was Run Over By A Car And Killed Took Place In Bangalore's Pulikeshi Nagar
Follow us
Srikar T

|

Updated on: Nov 02, 2023 | 1:33 PM

సాధారణంగా మన చుట్టూ అనేక ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లావాదేవీల వెనుక ఒక విషాదం నెలకొంది. తన విలాసానికి కారును కొనుగోలు చేసి ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదనే కారణంగా పరస్పరం గొడవ జరిగింది. ఈ ఆర్థిక వ్యవహారంలో ఇరువురి మధ్య రాజీ కుదరక పోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగర నడిబొడ్డున చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ భయానక సంఘటనకు మూల కారణమైన ఇద్దరు నిందితుడిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండుకు పంపించారు.

బెంగళూరులోని పులికేశి నగర్‌లో జరిగిన విషాద సంఘటన అందరినీ భయాందోళనకు గురిచేసింది. మోటారు సైకిల్‌పై వచ్చి కారును ఢీకొట్టి ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 18 అర్థరాత్రి 12.30 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రికార్డ్ అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. స్కార్పియోలో ప్రయాణిస్తున్న వ్యక్తి వేరొకరిని వెంబడించి ఢీకొట్టి కావాలనే గొడవకు కారణమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫుటేజీలో అస్గర్ బాధితుడు కాగా.. అమ్రీన్‌ను నిందితుడుగా తేల్చారు పోలీసులు. చాలా మంది సంచరిస్తూ రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగింది. అయినప్పటికీ అమ్రీన్ దాడి నుంచి తప్పించుకునేందుకు అస్గర్ తీవ్రంగా శ్రమించారు. రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీశారు. అయినప్పటికీ అర్థరాత్రి కావడంతో స్థానికులు ఇతని పెద్దగా పట్టించుకోలేదు. సెకండ్ హ్యాండ్ వాహనానికి సంబంధించిన రూ. నాలుగు లక్షలు చెల్లించలేదన్న నెపంతో అతి కిరాతకంగా కారును ఆ వ్యక్తిపైకి ఎక్కించి చంపేశాడు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. పరిస్థితి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్రీన్‌తో పాటూ ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.