Japan: ఇడ్లీ సాంబార్ రుచిలో జపాన్ కుర్రాళ్లు అదుర్స్.! క్యూ కడుతున్న జపాన్ వాసులు
జపాన్‌లోని క్యోటోలో తడ్కా అనే దక్షిణ భారత రెస్టారెంట్ ఉంది. దీన్ని నిర్వహిస్తున్న ఇద్దరు కుర్రాళ్లు ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర సౌత్ ఇండియన్ వంటకాలన్నీ భారత చెఫ్‌లకు తీసిపోనీ విధంగా రుచికరంగా వండి వార్చుతున్నారు. వాస్తవానికి జపాన్ వాసులు ఆహారాన్ని చాప్ స్టిక్‌లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషం.
జపాన్‌లోని క్యోటోలో తడ్కా అనే దక్షిణ భారత రెస్టారెంట్ ఉంది. దీన్ని నిర్వహిస్తున్న ఇద్దరు కుర్రాళ్లు ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర సౌత్ ఇండియన్ వంటకాలన్నీ భారత చెఫ్‌లకు తీసిపోనీ విధంగా రుచికరంగా వండి వార్చుతున్నారు. వాస్తవానికి జపాన్ వాసులు ఆహారాన్ని చాప్ స్టిక్‌లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషం. అంతేగాదు ఈ రెస్టారెంట్‌కి మన భారతీయుల కంటే చైనా కస్టమర్లే ఎక్కువగా వస్తారట. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రికి మాజీ పాలసీ సలహదారు ప్రసన్న కార్తీక్ నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జపాన్ కుర్రాళ్లు ప్రతి ఏడాది చెన్నై వెళ్లి వెరైటీ వంటకాల తయారీ విధానాన్ని నేర్చుకుని వస్తుంటారని పోస్ట్‌లో తెలిపారు కార్తీక్. పైగా చెన్నై వెళ్లిన ప్రతిసారి అరుణాచలం వెళ్తారని అలాగే తిరువణ్ణామలైలోని భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారని కూడా తన ట్వీట్లో తెలిపారు. అంతేగాదు మన ఇండియన్ రెస్టారెంట్‌ల మాదిరిగా కాంప్లిమెంటరీ ఫిల్టర్ కాఫీని సైతం ఆ జపాన్ కుర్రాళ్లు అందించినట్లు తెలిపారు. ఈ కుర్రాళ్లిద్దరూ జపాన్‌లో భారత్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశారంటూ ట్విట్టర్‌లో ప్రశంసలతో ముంచెత్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

