Viral: లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కోసం కొట్లాట.. లిఫ్ట్‌ కదలకుండా నిలబడ్డ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.

Viral: లిఫ్ట్‌లో పెంపుడు కుక్క కోసం కొట్లాట.. లిఫ్ట్‌ కదలకుండా నిలబడ్డ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 8:16 AM

పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారికి, ఓ మహిళకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ మహిళ తన పెంపుడు శునకంతో లిఫ్ట్‌ ఎక్కింది. అక్కడ నివాసముంటున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అందుకు అనుమతించలేదు. శునకాన్ని బయటకు పంపేయాలని.. లిఫ్ట్‌ కదలకుండా డోర్‌కు మధ్యలో నిలబడ్డారు.

పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారికి, ఓ మహిళకు మధ్య ఘర్షణకు దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లో గ్రేటర్‌ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఓ మహిళ తన పెంపుడు శునకంతో లిఫ్ట్‌ ఎక్కింది. అక్కడ నివాసముంటున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అందుకు అనుమతించలేదు. శునకాన్ని బయటకు పంపేయాలని.. లిఫ్ట్‌ కదలకుండా డోర్‌కు మధ్యలో నిలబడ్డారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ ఘటనను ఆ మహిళ తన ఫోన్‌లో రికార్డు చేస్తుండగా.. ఆయన కూడా అదే పని చేస్తుండడంతో ఆమె అతని ఫోన్‌ను లాక్కుంది. దీంతో కోపంతో మాజీ అధికారి ఆమె జుట్టు పట్టుకుని లాగారు. ప్రతిదాడికి దిగిన యువతి అతడి చెంపపై కొట్టింది. విచక్షణ మరచి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఆమె భర్త కూడా అతడిపై చేయి చేసుకున్నాడు. సెక్యూరిటీ సహా మరికొందరు వచ్చి వారిని అడ్డుకున్నారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వచ్చి సీసీటీవీని పరిశీలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..