గాజాలో దాడులు ఆపే ప్రసక్తే లేదు.! అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే: నెతన్యాహు.

గాజాలో దాడులు ఆపే ప్రసక్తే లేదు.! అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్లే: నెతన్యాహు.

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 8:40 AM

హమాస్‌ మిలిటెంట్లు ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులకు దిగుతోంది. మరో వైపు హమాస్‌.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై రాకెట్‌ దాడులు చేస్తోంది. ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా.. దాడులు మాత్రం ఆగట్లేదు. తాజాగా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటన చేశారు.

హమాస్‌ మిలిటెంట్లు ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం భూతల దాడులకు దిగుతోంది. మరో వైపు హమాస్‌.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై రాకెట్‌ దాడులు చేస్తోంది. ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా.. దాడులు మాత్రం ఆగట్లేదు. తాజాగా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటన చేశారు. గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని, అలా ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడిపించుకోవడంలో తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని కోరారు. హమాస్‌ వెంటనే, బేషరతుగా బందీలను విడుదల చేయాలని.. ఈ మేరకు అంతర్జాతీయ సమాజం డిమాండ్‌ చేయాలని నెతన్యాహు అభ్యర్థించారు. అంతకుముందు గాజాపై దాడుల నేపథ్యంలో నెతన్యాహు కేబినెట్‌లో మాట్లాడారు. గాజాలోని హమాస్‌ మిలిటెంట్లపై దాడుల్లో ఇజ్రాయెల్‌ సైన్యం పురోగతి సాధిస్తోందని ప్రకటించారు. గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం మరింత విస్తరించిందని శక్తిమంతంగా అడుగులు వేస్తూ పురోగతి సాధిస్తోందని అన్నారు. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేస్తున్నామని నెతన్యాహు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..