అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఖమ్మం విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఖమ్మం విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్, అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబరు 31న వరుణ్ జిమ్‌కు వెళ్లాడు. జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఓ దుండగుడు కత్తితో వరుణ్‌ను కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం వరుణ్‌ను ఆస్పత్రికి తరలించారు. వరుణ్ బతికే ఛాన్స్ 5 శాతం మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. వరుణ్‌పై దాడి చేసిన దుండగుడిని జోర్డాన్ ఆండ్రాడ్‌గా గుర్తించారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..
మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బాటిళ్లకోసం ఎగబడిన జనం
LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

