మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బాటిళ్లకోసం ఎగబడిన జనం
బీహార్‌లో మద్యం తరలిస్తున్న ఓ వాహనానికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరికైనా ప్రమాదం జరిగిందేమోనని సాయం చేయడానికి స్థానికులు అక్కడికి వెళ్లారు. అయితే సాయం చేయడానికి బదులు అక్కడ కనిపించిన మద్యం బాటిళ్లను ఎత్తుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇప్పటికే బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. అయినా అక్కడ మద్యం అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్టపడటంలేదు. ఈ క్రమంలో ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా... ఆ కారు ప్రమాదానికి గురైంది.
బీహార్‌లో మద్యం తరలిస్తున్న ఓ వాహనానికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరికైనా ప్రమాదం జరిగిందేమోనని సాయం చేయడానికి స్థానికులు అక్కడికి వెళ్లారు. అయితే సాయం చేయడానికి బదులు అక్కడ కనిపించిన మద్యం బాటిళ్లను ఎత్తుకుని ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇప్పటికే బీహార్‌లో మద్యనిషేధం అమలులో ఉంది. అయినా అక్కడ మద్యం అక్రమ రవాణాకి మాత్రం అడ్డుకట్టపడటంలేదు. ఈ క్రమంలో ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా… ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈక్రమంలో స్థానికులు మద్యం సీసాలు ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళుతున్న ఆ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో దారిన వెళ్లే వారు సాయం చేసేందుకు వచ్చారు. అప్పటికే అందులో ఉన్న వారు కారును వదిలి పారిపోయారు. అయితే.. లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో స్థానికుల కళ్లు మెరిసాయి. అంతే దొరికిన వారికి దొరికినంత అన్నట్టుగా కారులోని బాటిళ్లు మొత్తం ఎత్తుకుని వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..

