Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్‌..

Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్‌..

Phani CH

|

Updated on: Nov 02, 2023 | 9:42 PM

మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఏదైనా కొత్తరకం వాహనం కనిపించినప్పుడు ఆసక్తిగా చూస్తాం. వీలైతే ఫోటోలు తీసుకుంటాం. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ మినీ బుల్లెట్‌ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెట్లలో బోన్సాయ్‌ వృక్షాలు మాదిరిగా ఇది బోన్సాయ్‌ బుల్లెట్‌ అన్నమాట. పింక్‌ కలర్‌లో ఆకట్టుకుంటున్న ఈ బుడ్డి బుల్లెట్‌ వీక్షకుల మనసు దోస్తోంది. మార్కెట్‌లో రన్నింగ్‌లో లేని పాత యాక్టివా స్కూటర్‌ సరికొత్త రూపుదాల్చింది.

మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఏదైనా కొత్తరకం వాహనం కనిపించినప్పుడు ఆసక్తిగా చూస్తాం. వీలైతే ఫోటోలు తీసుకుంటాం. తాజాగా ఢిల్లీ వీధుల్లో ఓ మినీ బుల్లెట్‌ చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెట్లలో బోన్సాయ్‌ వృక్షాలు మాదిరిగా ఇది బోన్సాయ్‌ బుల్లెట్‌ అన్నమాట. పింక్‌ కలర్‌లో ఆకట్టుకుంటున్న ఈ బుడ్డి బుల్లెట్‌ వీక్షకుల మనసు దోస్తోంది. మార్కెట్‌లో రన్నింగ్‌లో లేని పాత యాక్టివా స్కూటర్‌ సరికొత్త రూపుదాల్చింది. యాక్టివా కాస్తా బుల్లెట్‌.. అదే మినీ పింక్ బుల్లెట్‌లా మారిపోయింది. సైకిల్‌ కంటే చిన్నగా ఉన్న ఈ మినీ బుల్లెట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా యూజర్‌ రామ్మీ రైడర్ తన సోషల్‌ మీడియా ఖాతాలోషేర్‌ చేశారు. ఈ మినీ పింక్‌ బుల్లెట్‌ అటు ట్రాఫిక్‌ పోలీసులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం

ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..

మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్‌.. బాటిళ్లకోసం ఎగబడిన జనం

LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??