Viral: చెట్టు వేరునుంచి స్వచ్ఛమైన జలధార..ఎక్కడి నుంచి, ఎలా వస్తోంది.? వీడియో..

Viral: చెట్టు వేరునుంచి స్వచ్ఛమైన జలధార..ఎక్కడి నుంచి, ఎలా వస్తోంది.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 9:59 AM

అప్పుడెప్పుడో భైరవద్వీపం సినిమా చూసినప్పుడు.. అందులో హీరో బాలకృష్ణ ఓ చెట్టు నుంచి నీరు పారుతున్న సౌండ్ ని వింటాడు. దీంతో ఆ చెట్టు కొమ్మను నరకడంతో స్వచ్ఛమైన జలం బయటకు ధారగా వస్తుంది. అది చూసి బాలయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెట్టును చూసి.. అబ్బా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత ఇలాంటి చెట్లు అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయని ప్రకృతి ప్రేమికులు చెబుతారు.

అప్పుడెప్పుడో భైరవద్వీపం సినిమా చూసినప్పుడు.. అందులో హీరో బాలకృష్ణ ఓ చెట్టు నుంచి నీరు పారుతున్న సౌండ్ ని వింటాడు. దీంతో ఆ చెట్టు కొమ్మను నరకడంతో స్వచ్ఛమైన జలం బయటకు ధారగా వస్తుంది. అది చూసి బాలయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెట్టును చూసి.. అబ్బా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత ఇలాంటి చెట్లు అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయని ప్రకృతి ప్రేమికులు చెబుతారు. ఇప్పుడు అలాంటి చెట్టు ఒకటి ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించింది. దీంతో ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పైగా ఆ చెట్టుకు సమీపంలోనే శివాలయం ఉండడంతో అదంతా శివయ్య మహిమే అంటూ చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ చెట్టు నుంచి నీరు ఎలా వస్తోంది? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? ఇటీవల కొన్ని రకాల చెట్ల నుంచి నీరు ఉబికిరావడం, పాలు కారడం చూశాం. కానీ అంతకు మించిన విచిత్ర సంఘటన ఏలూరు జిల్లా ఏజెన్సీలో వెలుగులోకి వచ్చింది. అవును, ఏలూరు ఏజెన్సీలోని కట్కూరు గ్రామంలో ఓ చెట్టు వేరు నుంచి స్వచ్ఛమైన నీటి ధార ప్రవహిస్తోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెట్టు వేరు నుంచి నీరు వస్తోందని, అదంతా దేవుని మహిమే అని అంటున్నారు స్థానికులు.

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కట్కూరు అనే గ్రామంలో ఒక చెట్టు వేరు నుంచి నిరంతరాయంగా నీరు వస్తోంది. స్థానిక మహా శివుడి ఆలయం సమీపంలో ఈ చెట్టు ఉంది. ఏళ్ల క్రితం నుంచి ఈ వృక్షం క్రింద వేరు నుంచి నీరు ధారగా వస్తోందని స్థానికులు చెబుతున్నారు. కాలంతో పని లేకుండా నిరంతరం ఈ చెట్టు వేరు నుంచి నీరు రావడం అటు పర్యాటకులను, ఇటు భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. స్వచ్ఛమైన ఈ నీరు తాగితే రోగాలు సైతం నయమవుతున్నాయని స్థానికులు, ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం. మొదట్లో ఈ చెట్టు వేరు నుంచి వస్తున్న నీటిని చూసిన స్థానికులు కొండ కోనల్లో నుంచి నీరు వస్తుందని భావించారు. అయితే మండు వేసవిలో సైతం నీరు అలాగే రావడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ నీరు ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అది ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. ఇక్కడ సమీపంలో మహా శివుడి ఆలయం ఉండటం, పక్కనే చెట్టు వేరు నుంచి నీరు రావడం.. ఇదంతా పరమేశ్వరుడి మహిమే అని భక్తులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా చెట్టు వేరు నుంచి వస్తోన్న ఈ నీరు ఇక్కడికి వచ్చే పర్యాటకులు, భక్తుల దాహాన్ని తీరుస్తోంది. చుట్టూ ఎత్తైన కొండలు కోనలు నడుమ ప్రకృతి అందాలతో విలసిల్లే ఈ కట్కూరు ప్రాంతం లో ఈ వింత అందరినీ కట్టి పడేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos