Plane on Truck: గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డుపై దూసుకెళ్తే..! వింతగా చూస్తున్న జనం..

Plane on Truck: గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డుపై దూసుకెళ్తే..! వింతగా చూస్తున్న జనం..

Anil kumar poka

|

Updated on: Nov 02, 2023 | 9:49 AM

అవును, మీరు చదివింది నిజమే. గాల్లో ఎగిరే విమానం రోడ్డుమీద దూసుకెళ్తే ఎలా ఉంటుంది. అప్పుడందరూ విమానాల్లోనే ప్రయాణిస్తారు కదా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఓ పెద్ద విమానం రోడ్డుమీద ప్రయాణించింది. అది చూసి అందరూ మొదట చాలా భయపడ్డారు. అయ్యో.. ప్రమాదమేమైనా జరిగిందా? విమానం రోడ్డుమీదకు ఎందుకొచ్చిందంటూ అందరూ అటుగా పరుగులు తీశారు. దగ్గరకు వెళ్లాక అందరూ ఆశ్చర్యపోయారు.

అవును, మీరు చదివింది నిజమే. గాల్లో ఎగిరే విమానం రోడ్డుమీద దూసుకెళ్తే ఎలా ఉంటుంది. అప్పుడందరూ విమానాల్లోనే ప్రయాణిస్తారు కదా… శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఓ పెద్ద విమానం రోడ్డుమీద ప్రయాణించింది. అది చూసి అందరూ మొదట చాలా భయపడ్డారు. అయ్యో.. ప్రమాదమేమైనా జరిగిందా? విమానం రోడ్డుమీదకు ఎందుకొచ్చిందంటూ అందరూ అటుగా పరుగులు తీశారు. దగ్గరకు వెళ్లాక అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే మొబైల్స్‌కి పనిచెప్పారు. సెల్ఫీలు, వీడియోలు, పోటోలు తీసుకుంటూ ఇంత పెద్ద విమానాన్ని ఇంత దగ్గరగా చూశాం అంటూ ఆనందంతో పొంగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అనంతపూర్ లోని కస్టమ్స్ ఏవియేషన్ అకాడమీ కాలేజీలో విద్యార్థుల అవగాహన కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అనంతపూర్ కు ఎయిర్ ఇండియా విమాన విడిభాగాలను రెండు భారీ ట్రక్కులలో అధికారులు తరించారు. మొత్తం 25 విడి భాగాలను ఆ భారీ ట్రక్కులో చేరవేశారు. మరో ట్రక్కులో విమానం ఇంజన్ సామాగ్రిని కూడా రోడ్డు మార్గంలోనే తరలించారు ఈ విమానం శంషాబాద్ నేషనల్ హైవే కి చేరుకోగానే ప్రజలంతా చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. 180 మంది ప్రయాణికులు పట్టే అతి పెద్ద విమానాన్ని దగ్గరనుంచి చూసి అక్కడున్నవారంతా కేరింతలు కొట్టారు. అతి పెద్ద విమానం కావడంతో రోడ్డు క్రాస్‌ చేసే సయంలో ట్రక్కు డ్రైవర్‌ చాలా శ్రమపడాల్సి వచ్చింది. వాహనదారులంతా వాహనాలను ఆపేసి విమానాన్ని చూస్తుండిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos