Basara: బాసర సరస్వతి ఆలయంలో పాములు.. భయాందోళనలో భక్తులు.. వీడియో.
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అమ్మవారి అనుగ్రహం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు బాసరకు వెళతారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. అమ్మ ఆశీస్సులతో ఓనమాలు దిద్దిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు విష ప్రాణులు సంచరిస్తూ అటు భక్తులను, ఇటు ఆలయ సిబ్బందినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అమ్మవారి అనుగ్రహం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు బాసరకు వెళతారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. అమ్మ ఆశీస్సులతో ఓనమాలు దిద్దిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు విష ప్రాణులు సంచరిస్తూ అటు భక్తులను, ఇటు ఆలయ సిబ్బందినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయం శ్రీదత్తాత్రేయ స్వామివారి ఆలయంలో పాములు కలకలం రేపాయి. ఇటీవలే పూజాదికాలు నిర్వహించేందుకు వచ్చిన పూజారిని ఓ పాము కాటేసింది. పూజారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తాజాగా జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో మరో పాము ప్రత్యక్షమైంది. దాంతో భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం పెట్టే భోజనశాలలో పాము కనిపించింది. వెంటనే ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. స్నేక్ క్యాచర్ పామును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత నెల రోజులుగా ఆలయంలో పాములు సంచరిస్తున్నాయని, తెల్లవారుజామును అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లాలంటే చాలా భయంగా ఉంటుందని పూజారులు తెలిపారు. ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయం వెనుక ఉన్న కొండచరియలు తొలగిస్తుండటంతో వాటిలోని పాములు, కొండచిలువలు ఆలయంలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. చీకటిలో ఆలయానికి వెళ్లే సమయంలో హోమ్‌గార్డ్స్‌ని వెంటబెట్టుకొని, లైట్లు వేసుకొని, శబ్దాలు చేస్తూ వెళ్లాలని ఆలయ ఈవో చెప్పారని పూజారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పాముల సంచారంతో భక్తులు, పూజారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయంలోకి పాములు చొరబడటం సర్వ సాధారణమే అయినా అందరూ అప్రమత్తంగా ఉండాలని భక్తలకు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos