ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్‌ పిలుపు

ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్‌ పిలుపు

Phani CH

|

Updated on: Nov 02, 2023 | 9:49 PM

హమాస్‌ మిలిటెంట్లకు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర దాడులను ఇరాన్‌ మరోసారి ఖండించింది. పాలస్తీనీయులపై అన్యాయంగా పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను ఒంటరి చేయాలని ఈ సందర్భంగా ఓఐసీ సభ్య దేశాలను కోరింది. ఇజ్చాయెల్‌కు తక్షణమే నిత్యావసర ఎగుమతులను నిలిపివేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్‌ బాంబు దాడులను తక్షణమే ఆపించాలని, ఇందుకోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా ఆ దేశానికి చమురు..

హమాస్‌ మిలిటెంట్లకు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న భీకర దాడులను ఇరాన్‌ మరోసారి ఖండించింది. పాలస్తీనీయులపై అన్యాయంగా పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను ఒంటరి చేయాలని ఈ సందర్భంగా ఓఐసీ సభ్య దేశాలను కోరింది. ఇజ్చాయెల్‌కు తక్షణమే నిత్యావసర ఎగుమతులను నిలిపివేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్‌ బాంబు దాడులను తక్షణమే ఆపించాలని, ఇందుకోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చేలా ఆ దేశానికి చమురు, ఆహార ఎగుమతులను నిలిపివేయాలని ఖమేనీ ఓ ప్రసంగంలో ఆయా దేశాలను కోరినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఇరాన్‌.. గతంలోనూ ఇలాంటి డిమాండ్లు చేసింది. ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సభ్య దేశాలను కోరింది. ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా తెంచుకోవాలని పిలుపునిచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్‌..

అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం

ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..

మద్యం తరలిస్తున్న కారుకు యాక్సిడెంట్‌.. బాటిళ్లకోసం ఎగబడిన జనం

LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??