Gaza childrens: చిన్నారుల శ్మశానవాటికగా గాజా.. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మృతి.

Gaza childrens: చిన్నారుల శ్మశానవాటికగా గాజా.. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మృతి.

Anil kumar poka

|

Updated on: Nov 03, 2023 | 9:22 AM

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతుండటం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరుగుతోంది. వేల మంది చిన్నారుల మరణంతో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిందని ఐక్యరాజ్యసమితి విభాగం యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతుండటం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరుగుతోంది. వేల మంది చిన్నారుల మరణంతో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిందని ఐక్యరాజ్యసమితి విభాగం యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. బాంబులు, మోర్టార్లకంటే ఎక్కువగా గాయాలతో ఇంకా మంచి నీటి కరవుతోనే అక్కడ చిన్నారులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు తెలిపింది. గతంలో సాధారణంగా వినియోగించే మంచి నీటిలో 5 శాతమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ముఖ్యంగా గుక్కెడు నీటి కోసం పిల్లల ఆరాటపడుతున్నారు. డీహైడ్రేషన్‌తోనూ పిల్లలు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు గాయాలు, మరోవైపు మానసిక భయాలు పిల్లల్ని వెంటాడుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారిలో 70శాతం మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలిపింది. కాగా.. గాజా సిటీలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌మెంటుపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేయడాన్ని మూడు అరబ్‌ దేశాలు ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈలు తీవ్రంగా ఖండించాయి. తమను తాము రక్షించుకోలేని పాలస్తీనా వాసులపై జరిగిన మారణకాండగా దీనిని ఖతార్‌ పేర్కొంది. ప్రత్యేకించి మహిళలు, పిల్లలపై జరిగిన దారుణంగా వ్యాఖ్యానించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos