Zika Virus: బెంగళూరులో వెలుగులోకి వచ్చిన జికా వైరస్.. ఎలా వ్యాపిస్తుందో తెలుసా..?
వైరస్‌లు మనకు కొత్తేమీ కాదు. అతి పెద్ద మహమ్మారి కరోనా వైరస్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. దీనిని తట్టుకుని ఇప్పుడిప్పుడే నిలబడింది భారత ఆర్థిక వ్యవస్థ. ఇది కాస్త మందగించిన వెంటనే నిఫా వైరస్ కేరళలో కలకలం రేపింది. ఇదంతా ఇలా ఉంటే బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపూర్‌లో జికా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది దోమల నుంచి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఒక దోమను గతంలో పరీక్షలకు పంపగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వైరస్‌లు మనకు కొత్తేమీ కాదు. అతి పెద్ద మహమ్మారి కరోనా వైరస్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. దీనిని తట్టుకుని ఇప్పుడిప్పుడే నిలబడింది భారత ఆర్థిక వ్యవస్థ. ఇది కాస్త మందగించిన వెంటనే నిఫా వైరస్ కేరళలో కలకలం రేపింది. ఇదంతా ఇలా ఉంటే బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపూర్‌లో జికా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇది దోమల నుంచి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఒక దోమను గతంలో పరీక్షలకు పంపగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయి.? ప్రాణాలకు ఏమైనా ప్రమాదమా కాదా అనే వివరాలతో పాటూ దీని తీవ్రత, మందులు ఏమైనా అందుబాటులో ఉన్నాయా..? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
బెంగళూరుకు సమీపంలోని చిక్కబళ్ళాపూర్ ప్రాంతంలో జికా వైరస్ కనుగొనబడింది. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలోని వాసులు తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి గల కారణాలపై పరిశోధనలు జరిపేందుకు అక్కడి దోమలను ఈ ఏడాది ఆగస్టులో పరీక్షల నిమిత్తం లాబ్‌కి పంపారు. అక్కడ జరిగిన పరిశోధనల్లో జికా వైరస్ గుర్తించబడింది. ఈ వైరస్ దోమల్లో వ్యాప్తి చెంది తద్వారా మానవులకు కుట్టడం వల్ల సంక్రమిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్ విస్తరించి ఉన్న సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో పోలీసులు, ఉన్నతాధికారులు ఆంక్షలను విధించారు. వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లోకి బయటి నుంచి వచ్చే కొత్త వారిని లోనికి.. లోపల నివసించే వారిని బయటకు పంపించకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 శాంపిల్స్‌ను సేకరించారు. అందులో ఆరు చిక్కబళ్లాపూర్‌కు చెందినవిగా గుర్తించారు. వీరిలో ఐదుగురికి నెగెటివ్‌గానూ.. ఒకరికి పాజిటివ్‌గానూ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురికి తీవ్ర జ్వరం ఉండటంతో వీరి నమూనాలను కూడా ల్యాబ్‌కి పంపినట్లు డాక్టర్ ఎస్ మహేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దోమల డ్రైవ్ నిర్వహించగా చిక్కబళ్ళాపూర్‌లో జికా వైరస్ దోమలు ఉన్నట్లు అక్టోబర్ 25న ఫలితాలు వచ్చాయి. జికా వైరస్ కలిగిన దోమలను ఏడెస్ దోమలుగా పిలుస్తారు. ఈ ఏడెస్ దోమ కాటు వల్ల జికా వైరస్ వ్యాపిస్తుందని తెలిపారు వైద్య శాస్త్ర నిపుణులు. ఈ దోమ కాటు ద్వారా డెంగ్యూ, చికున్ గున్యా వంటి ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపిస్తాయి. 1947లో ఉగాండాలో ఈ వైరస్ తొలిసారి వెలుగులోకి వచ్చినట్లు గుర్తించారు. గత ఏడాది డిశంబర్‌లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఐదేళ్ల బాలికకు కూడా జికా వైరస్ సోకినట్లు నిర్థారించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైన సహాయక చర్యలను చేపట్టేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా ఈ జికా వైరస్ ఒక వృద్దునికి వ్యాపించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.