Israel-Hamas War: భీకరంగా మారుతోన్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అభంశుభం తెలియని చిన్నారుల బలి
తమపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న ప్రతిదాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం మొదలైన పక్షం రోజుల్లోనే ఇరువైపుల మరణాల సంఖ్య 10వేలు దాటినట్లు అంచనాలు ఉన్నాయి. గాజాలోనే ఈ సంఖ్య 8వేలు దాటింది. అయితే.. అందులోనూ చిన్నారులు ఉండటం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ వర్గాల దాడిలో రోజుకు సరాసరి 420 మంది చిన్నారులు మరణించడమో, గాయాలపాలవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఈ భీకర పోరులో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతుండటం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేసి.. భారీ ప్రాణ నష్టాన్ని కలిగించారు. అంతేకాదు కొంతమందిని బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తమపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న ప్రతిదాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం మొదలైన పక్షం రోజుల్లోనే ఇరువైపుల మరణాల సంఖ్య 10వేలు దాటినట్లు అంచనాలు ఉన్నాయి.
గాజాలోనే ఈ సంఖ్య 8వేలు దాటింది. అయితే.. అందులోనూ చిన్నారులు ఉండటం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ వర్గాల దాడిలో రోజుకు సరాసరి 420 మంది చిన్నారులు మరణించడమో, గాయాలపాలవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేలమంది చిన్నారుల మరణంతో ‘గాజా.. చిన్నారుల శ్మశాన వాటిక’గా మారిందంటూ ఐక్యరాజ్యసమితి చిన్నారుల విభాగం యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పక్షం రోజుల్లోనే చిన్నారుల మరణాల సంఖ్య వేలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది యునిసెఫ్. ఇప్పటివరకు 3,450 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మరణాల సంఖ్య క్రమంగా పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని చెప్పింది. ప్రతి ఒక్కరికీ అదో ప్రత్యక్ష నరకం’ అని గాజాలో చిన్నారుల పరిస్థితి, మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యునిసెఫ్ ప్రకటన విడుదల చేసింది.
బాంబులు, మోర్టార్లకంటే ఎక్కువగా గాయాలతో, మంచి నీళ్ల కోసమే చిన్నారులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. గాజాలో 10లక్షల కంటే ఎక్కువ మంది చిన్నారులు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. గుక్కెడు నీటి కోసం చంటిపిల్లల ఆరాటం పెను ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారిలో 70శాతం మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా.. ఓవైపు గాయాలు, మరోవైపు మానసిక భయాలు చిన్నారులను వెంటాడుతున్నాయని తెలిపింది యూనిసెఫ్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..