చింతపండు తినే అలవాటు మీకూ ఉందా? ఏం జరుగుతుందో తెలుసా
పుల్లని, తీపి కలగలిసిన రుచితో ఉండే చింతపండు వంటలకు దట్టిస్తే తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చింతపండును సాధారణంగా దాని వాసన, రుచి కోసం పలు వంటలలో ఉపయోగిస్తాం. వంటల్లో కాకుండా కొంతమందికి చింతపండు పచ్చిగానే..

ప్రతి ఇంటి వంటగదిలో వంటకు ఉపయోగించే రకరకాల పదార్ధాలు ఉంటాయి. ఇందులో చింతపండు ఒకటి. చాలా మందికి ఈ పేరు వినగానే నోరు ఊరడం సహజం. పుల్లని, తీపి కలగలిసిన రుచితో ఉండే చింతపండు వంటలకు దట్టిస్తే తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చింతపండును సాధారణంగా దాని వాసన, రుచి కోసం పలు వంటలలో ఉపయోగిస్తాం. వంటల్లో కాకుండా కొంతమందికి చింతపండు పచ్చిగానే తినడం మహా ఇష్టం. అసలు చింతపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
చింతపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు A, C, E, K, B6, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. చింతపండు తినడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రక్తపోటు నియంత్రణ
చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని అన్ని కాలాల్లో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కానీ దాని వినియోగం ఎల్లప్పుడూ మితంగానే ఉండాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలు అనుభవించే అసౌకర్యానికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఋతు తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో, శరీరంలో LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, HDL కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో, శరీర ద్రవాలను సమతుల్యం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
చర్మ ఆరోగ్యం
మొటిమలకు చింతపండు నీరు దివ్యౌషధం. ఇది చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. చిన్న గాయాలు, కాలిన గాయాల వల్ల కలిగే మచ్చలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




