Andhra Pradesh: ఆ అనుమానం.. పెనుభూతమైంది.. మద్యం తాగుదామని పిలిచి స్నేహితుడినే చంపేశాడు..
వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.. ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. వారిలో ఒకడికి మరొకడిపై చిన్న అనుమానం మొదలైంది.. అది కాస్త కక్షకు బీజం వేసింది. అయినా స్నేహంగానే ఉంటున్నారు. కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా ఆ అనుమానం మళ్ళీ తట్టి లేపింది. ఇక అంతే..! మాటల్లో ఉండగానే ఒక్కసారిగా మూడంతస్తుల భవనం పైనుంచి తోసేసాడు.

వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు.. ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. వారిలో ఒకడికి మరొకడిపై చిన్న అనుమానం మొదలైంది.. అది కాస్త కక్షకు బీజం వేసింది. అయినా స్నేహంగానే ఉంటున్నారు. కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా ఆ అనుమానం మళ్ళీ తట్టి లేపింది. ఇక అంతే..! మాటల్లో ఉండగానే ఒక్కసారిగా మూడంతస్తుల భవనం పైనుంచి తోసేసాడు. స్నేహితుడు అంత పని చేస్తాడని అనుకోని ఆ వ్యక్తి.. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణం కోల్పోయాడు. చిన్న అనుమానం కాస్త ఒక ప్రాణాన్ని తీసేస్తే.. మరోకరిని కటకటాల వెనక్కి నెట్టింది. విశాఖ రామటాకీస్ ప్రాంతంలో.. కిషోర్ అనే 26 ఏళ్ల యువకుడు భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమికంగా స్థానికులు ప్రమాదమని భావించినప్పటికీ.. మరో వ్యక్తి పైనుంచి కిందకు తోసేయడం వల్లే ప్రణాలు కోల్పోయినట్టు గుర్తించారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామా టాకీస్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన శివారెడ్డి.. రెల్లి వెతికి చెందిన కిరణ్.. సీతంపేటకు చెందిన కిషోర్ స్నేహితులు. ఒకరి ద్వారా ఒకరికి పరిచయమై స్నేహంగా ఉంటున్నారు. కిషోర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు. ఈ ముగ్గురులో శివారెడ్డికి చెడు వ్యసనాలు మొదలయ్యాయి. దీంతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. శివారెడ్డి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ముగ్గురు స్నేహితులు పరిచయంగా ఉన్నప్పుడే.. శివారెడ్డి భార్య ఉదయ్ తో సన్నిహితంగా ఉండేది. ఇదే శివారెడ్డిలో అనుమానం మొదలైంది. తన భార్యతో ఉదయ్ సన్నిహితంగా ఉండేందుకు.. కిషోర్ సహకరిస్తున్నాడని భావించాడు శివరెడ్డి. స్నేహంగా ఉంటూనే లోలోనా రగిలిపోయాడు. మద్యం తాగేందుకు శ్రీనగర్‌లోని అపార్ట్‌మెంటుకు రావాలని కిషోర్ ను పిలిచాడు. కిషోర్ తన స్నేహితులైన దేవా, కిరణ్‌లతో కలిసి అక్కడికి వెళ్లారు.
అనంతరం నలుగురు కలిసి మద్యం తాగారు.. దేవా, కిరణ్ నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కిషోర్ లేచి గోడ దగ్గరికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన శివారెడ్డి.. పైనుంచి కిషోర్‌ను తోసేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో మిగతా ఇద్దరు లేచి.. కిందకు చూసేసరికి రక్తపు మడుగులో గాయాలతో కిషోర్ పడి ఉన్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు కిషోర్.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పై హత్య కేసు నమోదు చేశారు. భార్యపై అనుమానం పెంచుకొని.. అది కాస్త స్నేహితుడి సహకరిస్తున్నాడని.. కోపంతో మెడ పైనుంచి తోసి ప్రాణం తీశాడని ద్వారక సీఐ సింహాద్రి నాయుడు పేర్కొన్నారు.
ఓ చిన్న అనుమానం మొదలై.. ఆ తర్వాత మధ్యవర్తిగా ఉన్నాడని కోపం పెంచుకొని స్నేహితుడనే హతమార్చినట్లు తెలిపారు. ఈ ఘటన మిగిలిన స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. మృతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..