AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్..

Amaravati IRR: ఏపీలో ఇప్పుడు కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది.

Big Breaking: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్..
Nara Lokesh
Shiva Prajapati
|

Updated on: Sep 26, 2023 | 1:50 PM

Share

ఏపీలో ఇప్పుడు కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ.. ఇప్పుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపైనా అభియోగాలు ఉన్నాయి. వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మరి తదుపరి అరెస్ట్ నారా లోకేష్‌ దేనా అనేది చర్చనీయాంశంగా మారింద.

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా.. ఈ కేసులో ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని, బాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ తరఫున న్యాయవాదులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కస్టడీ పిటిషన్‌పై చంద్రబాబు లాయర్లు కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై విచారణ బుధవారమే చేపడతామని స్పష్టం చేసింది కోర్టు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటికే చంద్రబాబును 2 రెండు రోజుల కస్టడీకి తీసుకుంది సీఐడీ. అయితే, సరైన సమాచారం రాలేదని, ఇంకా విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్, బుధవారం విచారణ..

చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి స్కిల్ స్కామ్ కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు సుప్రీంకి వెళ్లారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్.. బుధవారం విచారణ చేపడతామని తెలిపారు. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..