Andhra Pradesh: కోడి, చేపలు, మేక మాంసం కంటే పాములే ఇష్టం.. బతికి ఉన్న విషపు పాముని సైతం ఇష్టంగా తినేస్తున్న వ్యక్తి..
కోడి, చేపలు, మేక మాంసం కూడా అంత ఇష్టంగా తింటాడో?? లేదో?? తెలియదు గాని.. పాము కనపడితే చాలు నోటి తోనే పచ్చి మాంసాన్ని పీక్కుతింటాడు. గ్రామంలో పుల్లన్న పాములు తినడాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాల కూట విషం చిమ్మే పాములను తింటున్న పుల్లన్నకు ఏం కాకపోవడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు

పాము కంటపడితే ఎవరైనా ఏం చేస్తారు. ఆమడ దూరం పారిపోతారు. కాని అతనికి పాము కనిపిస్తే చాలు పండగే పండగ. విందుభోజనం లభించిందని.. వెంటపడి.. వేటాడి పామును పట్టుకుని పీక్కుతింటాడు. అయితే చైనా, థాయిలాండ్ వంటి దేశాల్లో కాదు.. మన ఆంధ్రప్రదేశ్ లోనే చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరుకు చెందిన పుల్లన్న అనే వ్యక్తికి పాము కనపడడమే పాపం అన్నట్లు.. పాములను వెంటాడి వేటాడి హ్యాపీగా తినేస్తున్నాడు.
కోడి, చేపలు, మేక మాంసం కూడా అంత ఇష్టంగా తింటాడో?? లేదో?? తెలియదు గాని.. పాము కనపడితే చాలు నోటి తోనే పచ్చి మాంసాన్ని పీక్కుతింటాడు. గ్రామంలో పుల్లన్న పాములు తినడాన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాల కూట విషం చిమ్మే పాములను తింటున్న పుల్లన్నకు ఏం కాకపోవడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా గ్రామంలో పాము కనపడడంతో కొడవలితో వెంటాడి పట్టుకుని. మెడలో వేసుకుని కొరుక్కుతింటున్న దృశ్యాలను గ్రామస్థులు తమ సెల్ ఫోన్లో రికార్డు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..