Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: మరణించీ చిరంజీవి.. కొడుకు బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసి రెండు ప్రాణాలు నిలిపిన కుటుంబ సభ్యులు

గత నెల 26న ముమ్మిడివరం బొండాయికోడు పెట్రోల్ బంక్ దగ్గర ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్లో వచ్చి బైక్ పై వెళుతున్న రాంబాబును ఢీకొట్టింది. దీంతో రాంబాబు కోమాలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. దీంతో తీవ్ర విషాదంలోను ఆయన కుటుంబ సభ్యులు గొప్పమనస్సు చాటుకున్నారు.

Konaseema: మరణించీ చిరంజీవి.. కొడుకు బ్రెయిన్ డెడ్.. అవయవదానం చేసి రెండు ప్రాణాలు నిలిపిన కుటుంబ సభ్యులు
Organ Donation
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2023 | 8:59 AM

అవయవదానం చేయండి.. మరోసారి జీవించండి. అవును ఆర్గాన్ డొనేషన్  చేసిన వారు మరణించే చిరంజీవులు. మరికొందరి జీవితాలకు వెలుగులు నింపే మహనీయులు.. ఇదే ప్రేరణగా తీసుకొని కాకినాడ జిల్లాలో శ్రీరాములు కుటుంబసభ్యులు గొప్ప మనస్సును చాటుకున్నారు. మరణంతో పోరాడి ఓడిన తమ కుటుంబ సభ్యుని అవయవాలు దానం చేసి రెండు ప్రాణాలను కాపాడారు.

అవయవదానం అంటే ఇతరులకు ప్రాణదానం చేయడమే. అవయవదానంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎంతోమందిని కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ ఈమాటను గుర్తిస్తే.. సమాజంలో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. కోనసీమ జిల్లాలోని కాట్రేకోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన గవర శ్రీరాములు అలియాస్ రాంబాబు కుటుంబ సభ్యులు ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 26న ముమ్మిడివరం బొండాయికోడు పెట్రోల్ బంక్ దగ్గర ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్లో వచ్చి బైక్ పై వెళుతున్న రాంబాబును ఢీకొట్టింది. దీంతో రాంబాబు కోమాలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. దీంతో తీవ్ర విషాదంలోను ఆయన కుటుంబ సభ్యులు గొప్పమనస్సు చాటుకున్నారు. అవయధానానికి ముందుకు వచ్చారు. ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి.. కిడ్నీలను తీశారు. ఒకటి ట్రస్ట్ హాస్పిటల్ రోగికి అమర్చారు. మరో కిడ్నీ విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు కాకినాడ నుంచి తరలించారు.

ఇవి కూడా చదవండి

అవయవాదానికి ముందుకు వచ్చిన గవర రాంబాబు కుటుంబ సభ్యులను ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు. ప్రత్యేకంగా యువత అవయవదానానికి ముందుకు రావాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..