అమెరికాలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరు భారతీయుల అరెస్ట్
అమెరికాలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టైంది. ఇండియానా రాష్ట్రంలో ట్రక్కు ద్వారా కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రక్కులో 140 కిలోల కొకైన్ పట్టుబడటం సంచలనం రేపింది. గురుప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్ అనే ఇద్దరూ అక్రమంగా అమెరికాలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

అమెరికాలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఇండియానాలో ట్రక్కులో డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అరెస్ట్ చేసింది. ట్రక్కులో 140 కిలోల కొకైన్ పట్టుబడడం సంచలనం రేపింది. గురుప్రీత్‌సింగ్ , జస్వీర్‌సింగ్‌లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇద్దరు కూడా అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. గుర్‌ప్రీత్ 2023లో యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించామని తెలిపింది. తాను భారతీయుడినని, అక్రమంగా యూఎస్‌లో ఉంటున్నానని గుర్‌ప్రీత్ అంగీకరించినట్లు తెలిపింది. ఇక, జస్వీర్ సింగ్ కూడా 2017లో అక్రమంగానే యూఎస్‌కు వచ్చినట్లు గుర్తించామని పేర్కొంది. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ఇది లక్ష 13 వేల మందికి పైగా 00)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు. గురుప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్ అమెరికాలోని ఇండియానాలో అదుపులోకి తీసుకున్నారు.
వీకెండ్ హైవే తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్ తరలిస్తున్నట్టు గమనించి స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, “ట్రక్కు సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్‌లో దుప్పటితో కప్పిన అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్‌తో తమకు సంబంధం లేదంటున్నారు గురుప్రీత్ సింగ్, జస్వీర్ సింగ్. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్‌మండ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు.
