Dussehra Holidays 2023: విద్యార్థులకు అలర్ట్.. దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. హాలీడేస్ ఎన్నిరోజులంటే..
Dussehra Holidays 2023: దసరాలు హాలిడేస్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది.

Dussehra Holidays 2023: దసరాలు హాలిడేస్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. ఈ సెలవులు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఉంటాయి. 24వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక స్కూళ్లకు సంబంధించిన వివరాలను 2023-24 అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొనడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్కూల్ విద్యార్థులకు ఎస్‌ఏ-1 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8 తరగతి మినహా మిగతా అన్ని తరగతులకు ఉదయం సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని ఆదేశించింది విద్యాశాఖ. ఇక పోతే క్రిస్మస్ సెలవులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ సెలవులను 7 రోజుల నుంచి 5 రోజులకు తగ్గించారు. ఇక జనవరి 12వ తేదీ నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణలోనూ దసరా సెలవులు..
తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు దసరా సెలవులను ఖరారు చేశారు. స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 14వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు సెలవుల ఇచ్చారు. తిరిగి అక్టోబర్ 26వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవనున్నాయి. సంక్రాంతి సెలవులు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉండన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




