AP News: చిరుతలు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయో తెల్సా.. అసలు మ్యాటర్ తెలిస్తే
చెంచులగూడెంలోకి ప్రవేశించి మహిళను చంపిన పెద్దపులి.. ఇలాంటి వార్తలు తరచుగా వింటూ ఉన్నాం చూస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు చిరుతలు పెద్ద పులులు అడవులు వదిలి జనావాసంలోకి జనం మధ్యలోకి వస్తున్నాయో వినలేదు చూడలేదు. కానీ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఒక విషయాన్ని కనిపెట్టారు.. అదేందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ సమగ్రంగా చూడండి చదవండి.
ఆత్మకూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సాయి బాబా చెప్పిన కథనం ప్రకారం.. చిరుతలు పెద్దపులులకు ప్రధాన ఆహారం అడవి పంది పిల్లలు. ఎక్కువగా చిరుతలు పార్టీ ఆహారంపైనే ఆధారపడి జీవిస్తుంటాయి. అయితే ఇటీవల అభయారణ్యంలో పంది పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే.. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్‌తో అడవి పందులు బాధపడుతున్నాయట. ఈ వైరస్‌కి అందులో అడవిలో ఎక్కువగా చనిపోతున్నాయట. అందుకని అడవి పంది పిల్లలు పెద్ద పులులు చిరుతలకు ఆహారంగా రావడం లేదు. పంది పిల్లల తర్వాత ప్రధాన ఆహారం చిరుతలకు కుక్కలే .
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
దీంతో కుక్కల కోసం చిరుతపులను జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అందులో భాగంగానే శ్రీశైలం చుట్టుపక్కల చిరుతపులలు తరచుగా తిరుగుతున్నాయి. ఏకంగా పూజారి ఇంటి ఆవరణలోకి చిరుత పులి వచ్చి వెళ్లడం సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపించడంతో స్థానికంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించారు. అయితే ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టగలిగామని, అయినప్పటికీ మూడేళ్ల పాటు వైరస్ గాలిలో ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం లో వేడికి చనిపోతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. భక్తులు స్థానికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి