Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?

1999లో, సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ గురించి జనాలకు పెద్దగా తెలియని తరుణంలో ఒక సినిమా విడుదలైంది. అతి తక్కువ సమయంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఇదే. మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్, సుశాంత్ సింగ్ ఈ చిత్రానికి పనిచేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Tollywood: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 10, 2025 | 9:33 PM

ఫ్యామిలీ, హారర్, థ్రిల్లర్.. ఇలా జోనర్లు అనేకం ఉన్నాయి. అలాగే ప్రతీ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీటిల్లో ఒకటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. బాలీవుడ్‌లో తలాష్, 13బి, కార్తీక్ కాలింగ్ కార్తీక్, గేమ్ ఓవర్ లాంటి చిత్రాలు ఈ జోనర్‌లోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాయి. 1999లో, సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఆ సమయంలో అతి తక్కువ రోజుల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఇదే. అదేనండీ.! 1999లో వచ్చిన ‘కౌన్’. మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్, సుశాంత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లో ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఊర్మిళ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనాలే భయపడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఊర్మిళ కెరీర్‌లో ఇదొక టార్చ్ బేరర్ అని చెప్పొచ్చు.

15 రోజుల్లో సినిమా పూర్తి..

ఏ సినిమా తీయాలన్నా చాలా ఏళ్లు పడుతుంది. థియేటర్లలో విడుదలయ్యాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందా.. లేదా.. అనే గ్యారెంటీ లేదు. ప్రస్తుతం చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూస్తున్నాయి. కానీ కౌన్ సినిమా చేయడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, అనురాగ్ కశ్యప్ కథను అందించారు. సినిమా కథ ఎంత ఎఫెక్టివ్‌గా ఉందంటే.. 26 ఏళ్ల తర్వాత కూడా అది కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

సినిమా ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడొచ్చు..

ఈ చిత్రం కథ విషయానికొస్తే.. ఒక ఇంట్లో ఒంటరిగా నివసించే ఒక అమ్మాయి.. అప్పుడే ఇద్దరు పురుషులు ఆమె ఇంటిలోకి వస్తారు. వారిద్దరూ ఒకడి తర్వాత ఒకడు చనిపోతారు. క్లైమాక్స్‌లో అందరినీ ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది. అంతే కాదు, సినిమాలో ఊర్మిళా మటోండ్కర్ చాలా నేచురల్‌గా నటించిందని ప్రశంసలు వచ్చాయి. IMDB ప్రకారం, ఈ చిత్రంలో ఊర్మిళ పాత్రకు పేరు లేదు. సినిమా అంతా ఆమెను మేడమ్ అని పిలుస్తారు. మీరు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?